BigTV English

Prabhas: ప్రభాస్ ఇంట్లో స్పెషల్ చెట్టు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.?

Prabhas: ప్రభాస్ ఇంట్లో స్పెషల్ చెట్టు.. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.?

Prabhas:చాలామంది రకరకాల సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. ఇందులో భాగంగా సినీ సెలబ్రిటీలకు కూడా ఇలాంటి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా స్టార్ట్ చేసే ముందు.. సినిమా రిలీజ్ లకి ముందు.. కొన్ని రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కూడా అలాంటి ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారట. ప్రభాస్ ఫాలో అయ్యే సెంటిమెంట్ విషయానికి వస్తే.. ఏకంగా ఆ ప్రత్యేకమైన చెట్టుని తన ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారట. మరి ఇంతకీ ప్రభాస్ ఇంట్లో ఉన్న ఆ ప్రత్యేకమైన చెట్టు ఏంటి..?దాని స్పెషలిటీ ఏంటి? ప్రభాస్ సెంటిమెంట్ కి ఆ చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రభాస్ పెరటిలో ఆ చెట్టుకి ప్రత్యేక స్థానం..

వరుస పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ప్రభాస్.. ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. అందులో భాగంగానే.. ప్రభాస్ ఇంట్లో ఒక ప్రత్యేకమైన చెట్టుని పెట్టుకున్నారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాదు (Hyderabad)లో ఒక లగ్జరీ ఇల్లు నిర్మించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఆ ఇంటి పనులు కూడా చాలా వరకు పూర్తయ్యాయట. అయితే ప్రభాస్ నిర్మించుకుంటున్న ఆ లగ్జరీ ఇంట్లో దాదాపు కోటి రూపాయలు విలువ చేసే కల్పవృక్షాన్ని స్పెషల్ గా పెట్టినట్టు తెలుస్తోంది.


కల్పవృక్షాన్ని నాటించిన ప్రభాస్..

ఇక కల్పవృక్షం (Kalpa Vruksham) అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కల్పవృక్షాన్ని శాంతి,సంపద, ఆరోగ్యం, సంతానం వంటి కోరికలు తీర్చే చెట్టుగా పేరుంది. అలాగే ఈ కల్ప వృక్షాన్ని పూజా కార్యక్రమాల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక పెద్దపెద్ద వాళ్లయితే తమ ఇంటి పెరట్లో ఈ చెట్టును నాటుకుంటూ ఉంటారు.అలా అంబానీ (Ambani) ఇంట్లో ఉన్న ఈ స్పెషల్ కల్పవృక్షాన్ని ప్రభాస్ కూడా తాజాగా తన కొత్త ఇంట్లో నాటించుకున్నట్టు తెలుస్తుంది. ఇక కల్పవృక్షం వయసు ఎంత ఎక్కువ ఉంటే అన్ని డబ్బులు.. అలా ప్రభాస్ ఇంట్లో నాటిన కల్పవృక్షం వయసు దాదాపు 100 సంవత్సరాలట.

వందేళ్ల నాటి ఈ కల్పవృక్షం ఖరీదు ఎంతంటే?

అందుకే దానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. దేవతల వనంలో ఉండే చెట్టుగా పురాణాల్లో ఎంతో ప్రత్యేకతగాంచిన ఈ కల్ప వృక్షాన్ని ప్రభాస్ ఏకంగా తన ఇంట్లో పెట్టుకున్నారు అనే వార్త ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు 100 సంవత్సరాల వయసున్న కల్పవృక్షం కేవలం అంబానీ ఇంట్లో మాత్రమే చూశారు. కానీ మళ్ళీ అలాంటి వృక్షాన్ని ప్రభాస్ ఇంట్లో కూడా నాటినట్టు తెలుస్తుంది.

ప్రభాస్ సినిమాలు..

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ది రాజా సాబ్ (The Raja Saab) మూవీ షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ (Fauji) మూవీలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత స్పిరిట్(Spirit), సలార్-2(Salaar-2) కల్కి పార్ట్ 2 (Kalki-2) వంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోతున్నారు.

ALSO READ:SC on Darshan’s bail: దర్శన్ బెయిల్‌పై సుప్రీం కోర్టు సీరియస్.. మళ్లీ జైలుకు ?

Related News

Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?

Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!

Arundhati: పెళ్లికి సిద్ధమైన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. బ్యాచిలర్ పార్టీలో రచ్చ రచ్చ!

Ajith -Shalini: నా హృదయాన్ని కరిగించావ్.. అజిత్ కాళ్ళు మొక్కిన షాలిని..

Kiara Advani: నేను డైపర్లు మారిస్తే.. నువ్వేమో.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కియారా!

Coolie Film: సింగపూర్ లో కూలీ హవా.. పవర్ హౌస్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్!

Big Stories

×