OTT Movie : ఎన్నిసినిమాలు చూసినా, దెయ్యాల సినిమాలు ఇచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చిల్లింగ్ సీన్స్ తో కేక పెట్టిస్తుంటాయి. ఓటీటీలలో ఇలాంటి సినిమాలకు కొదవ లేదు. అడుగడుగునా గుండె జలదరించే సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, తైవాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ చిత్రంగా నిలిచింది. దాని అద్భుతమైన సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రోనాన్ అనే తల్లి, ఆమె కూతురు డోడో చుట్టూ తిరిగే ఒక ఉత్కంఠ కథ. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో
‘ఇన్కాంటేషన్’ (Incantation) తైవాన్‌కు చెందిన భయంకరమైన ఫౌండ్ ఫుటేజ్ సూపర్ నాచురల్ చిత్రం. దర్శకుడు కెవిన్ కో దీనిని రూపొందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా హారర్ అభిమానుల చూపును దీనిపై పడేటట్టు చేసుకుంది. ఈ సినిమా 2022లో తైపీ ఫిల్మ్ అవార్డ్స్‌లో “బెస్ట్ నరేటివ్ ఫీచర్” నామినేషన్ పొందింది. IMDbలో 6.4/10 రేటింగ్ సంపాదించింది.
స్టోరీలోకి వెళ్తే
రోనాన్ ఇప్పుడు తనకుమార్తె డోడోతో ఒంటరిగా ఉంటోంది. ఆమె తన గతం తలచుకుని బాధపడుతుంటుంది. స్టోరీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. ఆరు సంవత్సరాల క్రితం రోనాన్ తన ప్రియుడు డామ్, అతని బంధువు యువాన్ తో కలిసి ఒక మారుమూల గ్రామంలో మదర్-బుద్ధ అనే దేవతను పూజించే యున్నాన్ మతంపై డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తుంది. ఈ సమయంలో వీళ్ళు ఒక నిషేధించిన గుహలో కి వెళ్ళడంతో ఒక అతీంద్రీయ శాపం పడుతుంది. దీనివల్ల అక్కడికక్కడే డామ్ మరణిస్తాడు. యువాన్ ఆత్మహత్య చేసుకుంటాడు. రోనాన్ మానసిక స్థితి క్షీణిస్తుంది. తన కుమార్తె డోడోను ఒక ఫోస్టర్ కేర్‌లో ఉంచుతుంది.
స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. రోనాన్ కోలుకోవడంతో, తన కూతురు డోడోను తిరిగి తీసుకొని మళ్ళీ డాక్యుమెంట్ చేస్తుంతుంటుంది. కానీ డోడో శరీరంపై రూన్స్ కనిపించడంతో పాటు అతీంద్రియ సంఘటనలు ఆమెను వేధిస్తాయి. ఫోస్టర్ హోమ్ మేనేజర్ మింగ్ సహాయంతో, రోనాన్ ఈ శాపం మదర్-బుద్ధ అనే దుష్ట శక్తి నుండి వచ్చిందని తెలుసుకుంటుంది. మదర్-బుద్ధ ఒక దేవత కాదు, ఆమె ఒక దుష్ట శక్తి. దీని ముఖం చూసిన వాళ్ళు తక్షణమే మరణిస్తారు. ఒక మంత్రం పఠించడం వల్ల, ఆవిగ్రహాన్ని ఒకేసారి ఎక్కువమందికి చూపించడం వల్ల ఈ శాపం తీవ్రత తగ్గుతుంది.
ఇప్పుడు రోనాన్ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఆ గృహలో ఉన్న మదర్ బుద్ధ విగ్రహాన్ని తన ఫోన్ ద్వారా ప్రేక్షకులకు చూపిస్తుంది. దీనివల్ల ఈ శాపం చూసే ప్రేక్షకులకు మల్లుతుంది. కూతురిపై దీని ప్రభావం తగ్గుతుంది. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను భయపెట్టే రీతిలో ఉంటుంది. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ప్రేక్షకులు చూడడంతో శాపం సినిమా చూసే ప్రేక్షకుల వైపు కూడా వెళుతున్నట్లు ఒక సూచన ఇస్తుంది.
Read Also : బాక్స్ లో పడుకున్న దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే కపుల్… గుండె ధైర్యం ఉన్నవాళ్ళే చూడాల్సిన హార్రర్ మూవీ