Husharu 2 Teaser: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాల హవా కొనసాగుతుంది. ఒక సినిమా సూపర్ హిట్ అయింది అంటే కచ్చితంగా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. 2018 సంవత్సరంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో హుషారు సినిమా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఇప్పుడు హుషారు 2(Husharu 2) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సీక్వెల్ సినిమాలో ఈసారి రెట్టింపు కామెడీ ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ వీడియో చూస్తే భయానక యాక్షన్ సన్నివేశాలతో పాటు కామెడీ కూడా వేరే లెవల్లో ఉండబోతుందని చూపించారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే ..ప్రతిగడపకు ఒక కథ ఉంటుంది కానీ ఈ చిత్ర గుంజలో మాత్రం ప్రతి గడపది ఓకే కథ.. అందరి ఇంటి పేరు ఒక్కటే ..భయం. ఒక వైపు రక్తంతో రాజ్యాన్ని పరిపాలించే రాక్షసుడు. మరోవైపు అడవిలో క్రూరంగా వేటాడే సాయుధుడు అంటూ వచ్చే డైలాగ్స్ టీజర్ వీడియోని వేరే లెవెల్ కి తీసుకువెళ్లాయి.
ఇలా ఈ టీజర్ వీడియోలో భారీ కామెడీ సన్నివేశాలతో పాటు యూత్ ఫుల్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తి(R. Narayanmuthi) పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది ఇందులో ఈయన నక్సలిజం లీడర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆర్.నారాయణమూర్తి సాధారణంగా కమర్షియల్ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటారు కానీ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హుషారు 2 సినిమాలో ఈయన నటించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా మొదటి భాగాన్ని మించిన కామెడీ ఈ సినిమాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు యాక్షన్ డోస్ కూడా ఉందని తెలుస్తోంది. ఇక ఈ టీజర్ వీడియో చూస్తుంటే కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ సినిమాకు మేజర్ అసెట్ గా నిలవ బోతున్నారు. ఈ సినిమాలో అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, విధి యాదవ్, తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకుడిగా వ్యవహరించగా సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
Also Read: నన్ను చూసిన ప్రతి మగాడు చెమటలు కక్కుతున్నారు.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!