E-Paper
Advertisement

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Advertisement

Sai Dharam Tej -Kiranmayi: సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత కొంతకాలం ప్రేమలో ఉన్నటువంటి తన ప్రేయసి కిరణ్మయి(Kiranmayi) అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. నవంబర్ 5వ తేదీ హైదరాబాద్ లో ఒక రిసార్ట్ లో చాలా ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ సమక్షంలో పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి నిశ్చితార్థపు(Engagment) వేడుక ఎంతో అంగరను వైభవంగా జరిగింది. ఇలా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది కిరణ్మయి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్(Kiranmayi Family Background) ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

వందల కోట్లకు వారసురాలు..

సాయి ధరమ్ తేజ్ ఇప్పటివరకు కిరణ్మయికి సంబంధించిన ఎలాంటి విషయాలను కూడా వెల్లడించలేదు అయితే తాజాగా ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించి పలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ సమాచారం ప్రకారం కిరణ్మయి వందల కోట్లకు వారసురాలు అని తెలుస్తోంది. కిరణ్మయి కుటుంబ విషయానికి వస్తే ఈమె ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తుంది. కిరణ్మయి తండ్రికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నట్టు సమాచారం. ఇలా వ్యాపార రంగంలో కొనసాగడమే కాకుండా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

కిరణ్మయి ఏం చేస్తారంటే..

Advertisement

కిరణ్మయి తండ్రి గొప్ప బిజినెస్ మెన్ గా కొనసాగుతూ వందల కోట్ల ఆస్తులను సంపాదించారని తెలుస్తుంది. ఇక కిరణ్మయి విషయానికి వస్తే ఈమె ఉన్నత చదువులను పూర్తి చేసి ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇలా గొప్ప వ్యాపారవేత్త కుమార్తె అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటూ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోకి ఈమె కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. ఇక ఈమె ఆస్తులకు సంబంధించి సరైన స్పష్టత ఎక్కడా లేకపోయినప్పటికీ వందల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తుంది.

డిసెంబర్ 10న వివాహం..

ఇలా ఉన్నత కుటుంబంలో జన్మించిన కిరణ్మయి మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. సాయి తేజ్ , కిరణ్మయి వివాహం డిసెంబర్ 10 వ హైదరాబాదులో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది . మరి వీరి వివాహ వేదిక ఎక్కడ ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక సాయి తేజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని 2027 జనవరి 12వ తేదీ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read: 2029 లో ఏపీ సీఎం అయ్యేది అతేనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

Related News

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్ ..!

విమర్శకులకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తానంటూ!

మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

Big Stories

Advertisement
×