Illegal Belt Shops: జిల్లాలో పదుల సంఖ్యలో వైన్ షాపులు ఉండగా.. వందల సంఖ్యలో అక్రమ బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బెల్ట్ షాపుల విచ్చలవిడి నిర్వహణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
పదులలో అధికారిక వైన్సులు ఉండగా వాటికి అనుబంధంగా వందల సంఖ్యలో అక్రమ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ మద్యం దందా సాగుతున్నప్పటికీ ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్ట్ షాపుల కారణంగా గ్రామాలలోని ప్రజలు, వీధులు,కోడళ్ళు, గ్రామపంచాయతీ కార్యాలయాలు గాంధీ విగ్రహాలు,జనావాసాల సమీపంలో మద్యం విక్రయాలు సాగుతున్నాయి.
Also Read: మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!
గద్వాల లోని మేళ్లచెరువు రోడ్డు దగ్గర ఒక వైన్ షాప్ కు ఆనుకొని అనేక మాంసాహార దుకాణాలు నెలకొల్పి అందులో మద్యం సేవించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఏరియా మందు బాబులకు అడ్డాగా మారడంతో అటువైపుగా రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో మద్యం సేవించి గొడవలకు దిగడం, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, సామాజిక బాధ్యతలు, శాంతి భద్రత సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిస అవుతుండగా పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా కుటుంబాలు చిన్నా భిన్నమవుతూ ఆసాంఘిక కార్యకలాపాలకు, నేరవృత్తికి పాల్పడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్టు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాప్ లను గుర్తించి, వాటి నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు పట్టణాలలో అక్రమ అభ్యర్థి షాపులపై సమగ్రతనిఖీలు చేపట్టాలని ప్రజలకు కోరుతున్నారు అక్రమ మద్యం విగ్రహాలకు అడ్డుపట్ట వేసి ప్రజల ఆరోగ్యం కుటుంబాల ఆర్థిక పత్రిక గ్రామీణ ప్రాంతాల ప్రశాంతతను కాపాడాలని కోరుతున్నారు.
Also Read: హైదరాబాద్లో పండుగ పూట తీవ్ర విషాదం.. వైన్ షాప్ వద్ద దాడిలో వ్యక్తి మృతి!