Harsha Bhogle On Rajat Patidar: పురుషుల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ 2026 (ACC Men’s Asia Cup Rising Stars 2026) కోసం ప్రకటించిన టీమిండియా జట్టుకు వైస్ కెప్టెన్ గా రజత్ పాటిదార్ కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బంపర్ ఆఫర్ ను లెఫ్ట్ లెగ్గుతో తన్నేసాడు రజత్ పాటిదార్ (Rajat Patidar). గాయాలు, ఫిట్నెస్ కారణాలు చూపి.. జట్టును ప్రకటించిన తర్వాత ఈ 50 ఓవర్ల ఫార్మాట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బాంబు పేల్చాడు. దీంతో ఉన్నఫలంగా అతడి స్థానంలో ఆయూష్ బదోనీ (Ayush Badoni) బీసీసీఐ నియమించుకోవాల్సి వచ్చింది.
అయితే దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇన్ని రోజులు రజత్ పాటిదార్ ను మెచ్చుకున్న వాళ్లే అతన్ని తిట్టడం మొదలు పెట్టారు. టీమిండియాలో అవకాశం కోసం ఇన్ని రోజులు పోరాడిన రజత్ పాటిదర్… రైజింగ్ స్టార్స్ జట్టులో అవకాశం వస్తే లైట్ తీసుకుంటావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక నీకు జన్మలో టీమిండియాలో ఛాన్స్ రాదంటూ విమర్శలు చేస్తున్నారు. బీసీసీఐ నిర్ణయాన్ని బేఖాతర్ చేస్తే చిప్పకూడే గతి అవుతుందని హెచ్చరిస్తున్నారు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు రజత్ పాటిదార్ (Rajat Patidar) ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే (Harsha Bhogle ) సీరియస్ అయ్యాడు. ఒరేయ్ రజత్ పాటిదర్ నీకు అసలు బుర్ర ఉందా? రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోసం టీమిండియా చాన్స్ వదులుకుంటావా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం రజత్ పాటిదర్ ఈ డ్రామాలు ఆడుతున్నాడని నిప్పులు చెరిగాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని… ఇలా వదులుకుంటావా ? అంటూ ఆగ్రహించాడు. టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తే, వదులుకున్నవాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదని విమర్శలు చేశాడు.
బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పుడు.. లెఫ్ట్ లెగ్గుతో రజత్ పాటిదర్ తన్నడమంటే దానికి గట్స్ కావాలని హర్ష భోగ్లే (Harsha Bhogle ) వెల్లడించాడు. అసలు టీమిండియాలోనే స్థానం లేని రజత్ పాటిదర్… ఆఫర్ వచ్చినప్పుడు కాదనడం బుర్ర తక్కువ పని అని విమర్శలు చేశాడు. గాయల పేరుతో డ్రామాలు ఆడటం కంటే టీమిండియా తరఫున ఆడటం మేలు అన్నాడు. భవిష్యత్తులో ఇకపై రజత్ పాటిదర్ కు ఇండియాలో అవకాశం రాకపోవచ్చు అని బాంబు పేల్చాడు. అదృష్టం ఒక్క సారి మాత్రమే తలుపు తడుతుందని.. అప్పుడు రియాక్ట్ కాకపోతే కాల గర్భంలో కాలగర్భంలో కలుస్తారని హాట్ కామెంట్స్ చేశాడు.