E-Paper
Advertisement

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!
Advertisement

Sonusood:ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ.. అందరిని ఆదుకుంటున్నారు. అలాంటి ఈయన తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రాణం పోశారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

మరో చిన్నారికి ఊపిరిపోసిన సోనూసూద్..

ఏడాది వయస్సున్న చిన్నారి తీవ్ర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండగా.. ఆమెకు వైద్య సహాయం అందించారు. పూర్తి వివరాలలోకి వెళ్తే.. ముంబైకి చెందిన చిన్నారి రాధిక తీవ్ర గుండె సమస్యతో బాధపడుతోంది. అసలే పేదరికంతో సతమతమవుతున్న కుటుంబానికి, చిన్నారికి కావలసిన వైద్య చికిత్స ఖర్చు మరింత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో 90 సంవత్సరాల వయసున్న బామ్మ తన మనవరాలు ప్రాణాలను కాపాడాలి అంటూ ఏకంగా సినీ నటుడు సోనూసూద్ ను ఆశ్రయించారు. వయసు మీద పడినప్పటికీ మనవరాలిని బ్రతికించాలనే ఆమె తపనను అర్థం చేసుకున్న సోనుసూద్ తన గొప్ప మనసు చాటుకున్నారు.

శస్త్ర చికిత్స పూర్తి..

Advertisement

ముంబైలో థానేలోని జూపిటర్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి, పాప శస్త్ర చికిత్సకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. డాక్టర్ అశుతోష్ ఆయన నేతృత్వంలోని వైద్య బృందం చిన్నారి రాధికకు క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించింది. చిన్నారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఈ విషయాన్ని సోనూసూద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.

సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్..

ఈ దీపావళికి దేవుడు నాకు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి ఇది అంటూ ఎమోషనల్ అయ్యారు సోనూసూద్. చిన్నారి రాధికకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స పూర్తయింది. ఈ దీపావళికి నాకు దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి. ఒక చిన్నారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగస్వామి కావడం రాధిక చిన్న గుండెకు మరోసారి కొట్టుకునే అవకాశం లభించింది. బామ్మ ముఖంలో చిరునవ్వు చూడడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చిన్నారి శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో సహకరించిన జుపిటర్ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ అశుతోష్ కి, ఆయన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ దీపావళికి నా దృష్టిలో అత్యంత ప్రకాశవంతమైన దీపం చిన్నారి రాధిక జీవితంలో వెలిగిన ఆశే” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Advertisement

also read:నిర్మాతగా మల్లి సీరియల్ బ్యూటీ.. కానీ దానికంటే ముందు!

సోనూసూద్ కెరియర్..

ప్రముఖ సినీ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న సోనూసూద్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. బాలీవుడ్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన అరుంధతి తో ఏకంగా ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత అభినేత్రి, ఆగడు, జులాయి , తీన్మార్, కందిరీగ, దూకుడు, ఆంజనేయులు ఇలా ఒక్కటేమిటి పదుల సంఖ్యలో తెలుగులో సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Related News

సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్ ..!

విమర్శకులకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తానంటూ!

మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

‘ఆదర్శకుటుంబం’ కు దీపావళి కలిసివస్తుందా..?

‘స్పిరిట్ ‘ కోసం వంగీ మామా మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుతుందా..?

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Big Stories

Advertisement
×