BigTV English

Kingdom Movie: ‘కింగ్డమ్’ మూవీలో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

Kingdom Movie: ‘కింగ్డమ్’ మూవీలో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్?

Kingdom Movie: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు సరైన హిట్ సినిమా లేదు. గీతాగోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ మూవీలు పడలేదు. గత ఏడాది ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను పలకరించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. కథ బాగానే ఉన్నా కూడా డైరెక్టర్ ప్రజెంటేషన్ కాస్త తేడాగా ఉండడంతో సినిమాలను ఆయన అభిమానులు సైతం ఆదరించలేకపోయారు. ఇప్పుడు కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు భారీ యాక్షన్ మూవీ కింగ్ డమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవాళ థియేటర్లోకి వచ్చేసింది. ప్రీమియర్ షోలతో ఈ సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో నటించిన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఈ మూవీలో నటించిన యాక్టర్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


‘కింగ్ డమ్’ లో ఎవరికి ఎంతంటే..?

విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ..  ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ 10 కోట్లు తీసుకున్నాడని టాక్.. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.. ఈ మూవీని రూ. 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది.. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగిందని తెలుస్తుంది… కలెక్షన్స్ ను బట్టే మూవీ ఉంటుంది..


Also Read :‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

‘కింగ్ డమ్’ స్టోరీ.. 

ఎప్పుడు లవర్ బాయ్ లాగా క్యూట్ గా కనిపించే విజయ్ దేవరకొండ మొదటిసారి యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో గుబురు గడ్డంతో రౌడీలాగా కనిపిస్తున్నాడు. శ్రీలంక బ్యాక్ డ్రాప్‌లో తీసిన ‘కింగ్డమ్’ సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్‌తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా బక్కోడు అనిరుధ్ పనిచేసారు. విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. మాస్ లుక్ విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఇవాళ భారీ అంచనాలతో మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి షోతో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మంచి టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది. మరి కలెక్షన్లు ఏమాత్రం ఉంటాయో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు ‘కింగ్డమ్’దే హవా.. విజయ్ కు ఇది హిట్ అయితే లైఫ్ మళ్లీ టర్న్ అవుతుంది.

Related News

Cm Revanth Reddy: చలనచిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి వెళ్లాలి

Anaganaga Oka Raju : వంశీ మామూలు ప్లానింగ్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్ టార్గెట్

OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!

Disha patani: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు, నిందితులు ఎన్కౌంటర్

OG Censor : ఓజి సినిమా సెన్సార్ పూర్తి, కొత్త రికార్డులు ఖాయం

TG Viswa Prasad: విశ్వప్రసాద్ సరికొత్త రూటు… ఇక ఇండస్ట్రీకి మంచి రోజులే

Manchu Lakshmi: ఆమె నా రోల్ మోడల్.. ట్విస్ట్ ఇచ్చిన మంచు లక్ష్మీ!

Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

Big Stories

×