OTT Movie : వెన్నెల కిషోర్, శకలక శంకర్ నటించిన ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమా హారర్ కామెడీ జానర్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఒక హాంటెడ్ బంగ్లాలో జరిగే ఈ స్టోరీ ఊహించని మలుపులతో ఆకట్టుకుంటోంది. హారర్ కామెడీ ఇష్టపడే వారికి ఇది ఒక వన్-టైమ్ వాచ్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
ఆహాలో స్ట్రీమింగ్
‘ఓ మంచి ఘోస్ట్’ (OMG) 2024లో విడుదలైన తెలుగు హారర్ కామెడీ సినిమా. దీనికి శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహించారు. అబినిక ఇనబతుని నిర్మించిన ఈ చిత్రం మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేతా, శకలాక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, నాగినీడు, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జూన్ 21న థియేటర్లలో విడుదలై, 2024 ఆగస్టు 15న ఆహా ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అనూప్ రూబెన్స్ సంగీతం, ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ, ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్‌తో రూపొందిన ఈ చిత్రం IMDbలో 7.4/10 రేటింగ్ ను సాధించింది.
స్టోరీలోకి వెళితే
చైతన్య (రజత్ రాఘవ్), పావురం (శకలాక శంకర్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్ నేని) అనే నలుగురు అపరిచితులు ఒక పోలీస్ స్టేషన్‌లో అనుకోకుండా కలుస్తారు. వీరందరూ డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చైతన్యకు వ్యాపార అప్పులు, పావురం అనే వ్యక్తి ఒక చిన్న గ్యాంగ్‌స్టర్‌గా డబ్బు కోసం , రజియా తన కుటుంబాన్ని పోషించాలనే ఒత్తిడి, లక్ష్మణ్‌కు వ్యక్తిగత ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ నలుగురూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుని, ఈ సమస్యలన్ని డబ్బుతో పరిష్కారమవుతాయని నమ్ముతారు. చైతన్య ఒక ఎమ్మెల్యే సదాశివరావు కూతురు కీర్తిని కిడ్నాప్ చేసి, డబ్బు సంపాదించే ఒక రిస్కీ ప్లాన్‌ను ప్రతిపాదిస్తాడు. ఆమె వరసకు అతనికి మరదలు అవుతుంది. ఆనలుగురూ ఈ ప్లాన్‌కు ఒప్పుకుని, కీర్తిని కిడ్నాప్ చేసి, ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉంచుతారు. అక్కడ వీళ్లంతా డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారు.
Read Also : పెళ్లి వద్దు, ప్రేమ ముద్దు… ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కొరియన్ సిరీస్… తెలుగులోనే స్ట్రీమింగ్