E-Paper
Advertisement

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’  ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?
Advertisement

Kingdom Twitter Review : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్నేళ్లు హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విజయ్ కు ఈ మూవీ హిట్ ను అందిస్తుందా? బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందా..? ఇలాంటి ప్రశ్నలు ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే.. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.. ఈ సినిమా హిట్ అయితే బాగుండునని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది..? ప్రీమియర్ షోలతో ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది.? నెటిజన్ల రియాక్షన్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

మా తెలంగాణ నుండి ఒక సరైన హీరో కూడా లేదు రా అని బాధ పడ్తుంటే ఒకడు వచ్చాడు.. అతను సినిమా ప్రమాణాలను పెంచాడు. తెలంగాణ సినిమా మరియు తెలుగు సినిమాకి ప్రధాన ప్రతినిధి అతను.. ఆల్ ది బెస్ట్ విజయ్ దేవురకొండ అని ట్వీట్ చేశారు.

Advertisement

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు పండగే.. మళ్లీ కేజీఎఫ్ ను చూసినట్లు ఉంది.. కొట్టేసావు అన్న గట్టిగా.. కంగ్రాట్స్ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. మాస్ యాక్షన్ మూవీ హిట్ పక్కా అని అంటున్నారు.

Advertisement

ఫస్ట్ ఆఫ్ బాగుంది.. అనురుద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ ఆఫ్ మైండ్ బ్లోయింగ్.. చాలా బాగుంది. విజయ్ అకౌంట్ లో హిట్ పడుతుంది అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

హీరో సాయి ధరమ్ తేజ్ కూడా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరికి ఆల్డ్ బెస్ట్.. బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలి అంటూ విష్ చేస్తూ ట్వీట్ చేశారు.

కింగ్ డమ్ ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవల్ చాలా బాగుంది. మ్యూజిక్, అలాగే బీజీఏం చాలా బాగున్నాయి. విజయ్ ఖాతాలో హిట్ పడినట్లే అంటూ ట్వీట్ చేశారు నెటిజన్..

ఎక్కువ మంది ఫస్ట్ హాఫ్ బాగుందని ట్వీట్ చేస్తున్నారు.. మరో కేజీఎఫ్ ను తలపిస్తుంది. అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.. సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. విజయ్ ఖాతాలో హిట్ పడినట్లే అనిపిస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.. ఈ మూవీ హిట్ అయితే విజయ్ మార్కెట్ మళ్లీ పెరుగుతుంది. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటాడో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే మరి..

Related News

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×