BigTV English

Kingdom Collections : విజయ్ దేవరకొండకు వీకెండ్ కలిసివచ్చిందా..? ‘కింగ్ డమ్’ కలెక్షన్స్ ఎంతంటే..?

Kingdom Collections : విజయ్ దేవరకొండకు వీకెండ్ కలిసివచ్చిందా..? ‘కింగ్ డమ్’ కలెక్షన్స్ ఎంతంటే..?

Kingdom Day 2 Collections: గత కొన్నేళ్లుగా హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ భారీ అంచనాలతో వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో కథల సెలెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ రెండో రోజు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో చూద్దాం..


‘కింగ్ డమ్ ‘ సెకండ్ డే కలెక్షన్స్..? 

ఈ మూవీ రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగింది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్‌తో నడిచింది. అన్ని చోట్లా ‘కింగ్డమ్‌’కు మంచి వసూళ్లే వచ్చినట్టుగా తెలుస్తోంది. నైజాంలో దాదాపు 11 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. సీడెడ్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో యాభై శాతం రికవరీ చేసినట్టుగా టాక్. అలా మొత్తంగా ఈ చిత్రానికి రెండో రోజు మాత్రం 25.5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. ఈ విధమైన కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఈ కలెక్షన్ల గురించి పూర్తి వివరాలను కింగ్ డమ్ టీమ్ వెల్లడించాల్సి ఉంది. మూడో రోజు కూడా భారీగానే ఓపెనింగ్స్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ వీకెండ్ ఎన్ని వసూల్ చేస్తుందో తెలుసుకుందాం..


Also Read: దుమ్ముదులిపేస్తున్నా ‘మహావతార్ నరసింహ’ కలెక్షన్లు..100 కోట్ల క్లబ్ చేరిందా..?

బడ్జెట్ & టార్గెట్? 

విజయ్ దేవరకొండ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది కానీ ఈ మధ్య ప్లాప్ సినిమాలు పలకరించడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈసారి ఎలాంటి కథతో వస్తాడో అని టెన్షన్ లో ఉన్నారు.. గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేశారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 130 కోట్ల రూపాయల తో నిర్మించారు. ఈ సినిమా నైజాం హక్కులు 10 కోట్ల రూపాయలు, అదే విధంగా సీడెడ్ హక్కులు 7 కోట్ల రూపాయల మేర జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. మొత్తానికి టార్గెట్ ను రీచ్ అవ్వలేదని తెలుస్తుంది. గతంలో వచ్చిన మూవీ లైగర్ డిజాస్టర్ అయ్యింది. దానితో పోలిస్తే కలెక్షన్స్ తక్కువగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. అయితే ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. అన్నదమ్ముల అనుబంధం టచ్ చేస్తుంది. ఇక పోలీసుల దాష్టీకం సామాన్యులపై ఎలా ఉంటుందనేది బాగా చూపించాడు దర్శకుడు. ఇంకోవైపు మాఫియాలో తండ్రీ కొడుకుల సంబంధం ఎలా ఉంటుందో చూపించారు. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×