BigTV English

CM Chandrababu: మండుటెండలో సీఎం ప్రోగ్రామ్.. స్టేజ్ లేదు, షామియానాలు లేవు.. ఎందుకంటే?

CM Chandrababu: మండుటెండలో సీఎం ప్రోగ్రామ్.. స్టేజ్ లేదు, షామియానాలు లేవు.. ఎందుకంటే?

అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నిధుల కార్యక్రమం మండుటెండలో జరిగింది. సీఎం చంద్రబాబు, మంత్రులు ఎండలో చెమటలు కారుతున్నా అక్కడే నిలబడ్డారు. రైతులతో కలసి కొంతసేపు మంచాలపై కూర్చున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఈ కార్యక్రమం విభిన్నంగా జరిగింది. స్టేజ్ లేదు, షామియానాలు లేవు, ఎవరి చేతిలో ప్లకార్డులు లేవు. చుట్టూ పచ్చని పంట పొలాలు, పొలాల మధ్యలో ఓ చిన్న ఖాళీ ప్రదేశం, అక్కడే రైతులు కూర్చునేందుకు మంచాలతో చిన్న ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబుకి కూడా కనీసం కుర్చీ లేదు. ఆయన కూడా రైతులతోపాటే మంచంపై కూర్చున్నారు. దాదాపు 2 గంటలసేపు ఈ కార్యక్రమం ఓపెన్ ఏరియాలోనే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇలా డిజైన్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఆ కారణాన్ని సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో వివరించారు.


అన్నదాతల కష్టం తెలిసేలా..
పొలంలో పనిచేసే రైతులు నిత్యం ఎండలోనే కష్టపడుతుంటారు. వారికి కుర్చీలుండవు, సెపరేట్ రూమ్స్ ఉండవు, నీడకోసం ప్రత్యేక ఏర్పాట్లేవీ ఉండవు, చెట్టునీడనే వారి విశ్రాంతి. వారు కష్టపడి పంటలు పండిస్తే అందరం దర్జాగా ఇంట్లో కూర్చుని తింటాం. మనం తినే తిండి వెనక రైతు కష్టం ఎంత ఉంటుందనేది అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ కష్టాన్ని, వారి త్యాగాలను, శ్రమను గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం పొలాల్లో నిర్వహించారు. కుర్చీలు లేకుండా కేవలం మంచాలను అక్కడ అరేంజ్ చేశారు. ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా మంచాలపైనే కూర్చున్నారు. విభిన్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.


అప్ డేట్ కావాలి..
ముందుగా రైతుల సమస్యల గురించి వారితో చర్చించారు సీఎం చంద్రబాబు. ఎలాంటి పంటలు వేస్తున్నారు, నీటి వసతి, ఆదాయం ఎలా ఉందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పంటల విషయంలో రైతులు అప్ డేట్ కావాలని, టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతుల చెప్పిన సమస్యలపై స్పందించిన ఆయన, వాటిని పరిష్కరించాలంటూ అధికారులను అక్కడే ఆదేశించారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి అధికారులు చెబుతారన్నారు.

మేలు ఇలా..
వైసీపీ హయాంలో ప్రతి ఏడాదీ రైతుల ఖాతాలో 13,500 రూపాయలు జమ అయ్యేవి. ఇందులో కేంద్రం వాటా 6వేల రూపాయలు. అంటే నికరంగా రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు రైతులకు అందజేసేది. కూటమి ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ.6వేలకు తోడు, రూ.14వేలు రైతుల ఖాతాలో జమ చేస్తోంది. అంటే గతంలో కంటే రెట్టింపు నిధులు ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందనమాట. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. కేంద్రం మూడు విడతల్లో రూ.6వేలు జమ చేస్తుంది. అంటే ఒక్కో విడతలో రూ.2 వేలు కేంద్రం తరపున రైతుల ఖాతాలో జమ అవుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.5వేలు, రెండో విడతలో రూ.5వేలు, మూడో విడతలో రూ.4వేలు జమ చేస్తుంది. మొత్తంగా ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు లబ్ధి చేకూరుతుంది.

Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×