Jabardast Rakesh: జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్(Rocking Rakesh) ఒకరు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాకేష్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఏకంగా నిర్మాతగా, హీరోగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతను (Sujatha)ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. జోర్దార్ వార్తల ద్వారా ఎంతో ఫేమస్ అయిన సుజాత బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఈమె రాకింగ్ రాకేష్ టీం లో కమెడియన్ గా సందడి చేస్తూ రాకేష్ ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకున్నారు.
రాకేష్ కుమార్తె ఖ్యాతి పుట్టినరోజు…
ఇలా ఈ జంట వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం వీరు సినిమాలు, సిరీస్ లలో నటించడమే కాకుండా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ జంటకు గత ఏడాది అమ్మాయి జన్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1వ తేదీ తన కుమార్తె ఖ్యాతి(Kyaathi) మొదటి పుట్టినరోజు (Birthday)వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితోపాటు బుల్లితెర నటీనటులు జబర్దస్త్ టీం, స్మార్ట్ జోడి టీం అందరూ ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారని తెలుస్తోంది.
హాజరైన రోజా..
ప్రస్తుతం ఖ్యాతి మొదటి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా సినీనటి, మాజీ మంత్రి ఆర్కే రోజా(R.K.Roja) కూడా పాల్గొని సందడి చేశారు. రాకేష్ కుమార్తెను ఎత్తుకొని తనతో సరదాగా ఆడుతూ రోజా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. తన కుమార్తె మొదటి పుట్టినరోజు కావడంతో ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్టు తెలుస్తుంది.
?igsh=Yjl4bjA4NTJpMTZk
సుజాత రాకేష్ కు సంబంధించి ఏ చిన్న వేడుక జరిగిన రోజా ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ జంటను ఆశీర్వదిస్తూ ఉంటారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్న సమయంలో రోజా తనకు కెరియర్ పరంగా అలాగే వ్యక్తిగతంగా కూడా ఎంతో సహాయం చేశారని, తనకు తన తల్లి జన్మనిస్తే రోజా గారు పునర్జన్మ ఇచ్చారని, ఎన్నో సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకు అండగా నిలిచారని పలు సందర్భాలలో రాకేష్ రోజా గురించి ఎంతో గొప్పగా తెలిపారు. ఇలా రాకేష్ పెళ్లి నుంచి మొదలుకొని ప్రతి వేడుకకు కూడా రోజా పాల్గొని ఈ జంటను ఆశీర్వదిస్తూ వచ్చారు. తాజాగా తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో కూడా ఈమె పాల్గొన్నారు. ఇక రాకేష్ సుజాత కుమార్తె పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా తమ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Sreeleela: తల్లి వల్ల శ్రీలీల కెరియర్ ఇబ్బందులలో.. డిమాండ్లు మరీ ఎక్కువయ్యాయా?