BigTV English

K-RAMP Glimpse : ఇవేం చిల్లర పనులు కిరణ్, బూతులు మాట్లాడితే హిట్ అయిపోతుందా.?

K-RAMP Glimpse : ఇవేం చిల్లర పనులు కిరణ్, బూతులు మాట్లాడితే హిట్ అయిపోతుందా.?

K-RAMP Glimpse : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. తాను మొదటి నటించిన రాజావారు రాణి గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది.


ఆ సినిమా తర్వాత చేసిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా కరోనా కష్టాల్లో విడుదలైన కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేసింది. అలానే రైటర్ గా కూడా కిరణ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఏ ముహూర్తం ఆ సినిమా హిట్ అయిందో కానీ వరుస సినిమాలు కిరణ్ కు వచ్చేసాయి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఆలోచనతో అన్ని సినిమాలను సైన్ చేసి ఉన్న పేరును పాడు చేసుకున్నాడు.

K-Ramp బూతులు 


ప్రస్తుతం కిరణ్ K-Ramp అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియో ఇప్పుడు విడుదలైంది. ఈ గ్లిమ్స్ వీడియో మొదలవగానే ” ఈసారి ఒక్కొక్కడికి బుర్రపాడు, బు*లు జారుడే” అనే డైలాగ్ తో మొదలుపెట్టారు. ఇక టీజర్ మొదలవుగానే కొన్ని బూతులను సహజంగానే మింగేసాడు కిరణ్ అబ్బవరం. అవి మింగని పక్షంలో, ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం.

కొన్ని మాస్ ఎలిమెంట్స్ ని పెడుతూ చివర్లో “AMB Cinemas లో మనం మలయాళం ప్రేమ కథలు చూసి hit చేస్తాం.. కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకి ప్రాబ్లం… ఎందుకంటే ?” అనే డైలాగ్ పెట్టి అతేంటిసిటీ అనే పదాన్ని కూడా ఒక బూతు పదంగా వక్రీకరించి డైలాగ్ చెప్పాడు. అయితే ఇది వైరల్ అవ్వడానికి పనికొస్తుంది అని చిత్ర యూనిట్ అనుకుంది గాని దీనివలన డామేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. అబ్బవరం కు కొంత ఫ్యాన్ బేస్ ఉంది అనే మాట వాస్తవం. ఇలా హిట్ కోసం పచ్చిపచ్చి బూతులు మాట్లాడితే ఉన్న ఫ్యాన్ బేస్ కూడా పోతుంది అని చెప్పాలి. సినిమా వర్కౌట్ అయితే పరవాలేదు కానీ పొరపాటున ఫెయిల్ అయితే సినిమాను కూడా ఈ స్థాయిలోనే బూతులు తిడతారు. ఈ సినిమాకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

“క” కాన్సెప్ట్ తో కం బ్యాక్ 

దాదాపు కిరణ్ అబ్బవరం పని అయిపోయింది అనుకునే తరుణంలో, క అనే కాన్సెప్ట్ బేస్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. చాలామందికి హిట్ తో అసలైన సమాధానం ఇచ్చాడు. కిరణ్ పైన నెగిటివ్ ఫీలింగ్ ఉన్నవాళ్లు కూడా ఆ సినిమా చూసి ఫిదా అయిపోయారు. అంత మంచి కాన్సెప్ట్ ఎంచుకోవడంతో మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు కిరణ్. ఆ సినిమా తర్వాత చేసిన దిల్రుబా అంతంత మాత్రమే ఆడింది. ఇప్పుడు మళ్లీ K-Ramp సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. కానీ ఇలాంటి డైలాగ్స్ ఉంటే సినిమా పాపులర్ అవడం కాకుండా సెన్సార్ దగ్గరే బలైపోతుంది. శ్రీ విష్ణు లాంటి వాళ్ళు బూతులు మాట్లాడినా కూడా అవి కవర్ అయ్యే విధంగా ఉంటాయి. కిరణ్ ఆ ప్రయత్నం చేసిన కొంతమేరకు వర్కౌట్ అయ్యేదేమో. ఆడియన్స్ దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related News

SSMB 29: రాజమౌళి మూవీపై కెన్యా మంత్రి బిగ్ అప్డేట్… ఈ ట్విస్ట్ మామూలుగా లేదుగా?

Allu Arjun – Pawan kalyan : అల్లు అర్జున్ ను పవన్ కాపీ కొడుతున్నాడా..? ఇదిగో ప్రూఫ్..

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?

Madharasi Censor Report: మదరాసి సెన్సార్‌ పూర్తి.. ఆ సీన్స్‌పై బోర్డు అభ్యంతరం, మొత్తం నిడివి ఎంతంటే

Big Stories

×