BigTV English

Udaipur Files Movie : మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ… రిలీజ్‌పై హై కోర్టులో విచారణ.. న్యాయమూర్తులు ఏమన్నారంటే?

Udaipur Files Movie : మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ… రిలీజ్‌పై హై కోర్టులో విచారణ.. న్యాయమూర్తులు ఏమన్నారంటే?

Udaipur Files Movie :ఉదయ్ పూర్ ఫైల్స్.. టైలర్ కన్హయ్య లాల్ మర్డర్ సినిమా విడుదలపై స్టే విధిస్తూ.. జూలై 10వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ చిత్ర నిర్మాత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు వైరల్ గా మారింది. సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా ఈరోజు అత్యవసర జాబితా కోసం ప్రస్తావించిన తర్వాత.. సుప్రీం కోర్ట్ జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి లతో కూడిన ధర్మాసనం ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ విషయాన్ని జాబితా చేయడానికి అంగీకరించింది.


హైకోర్టు పిటిషన్ పై నిర్మాతలు ఆగ్రహం..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం మోస్ట్ కాంట్రివర్షియల్ మూవీగా విడుదలకు ముందే పేరు తెచ్చుకున్న ఈ సినిమా మతపరంగా రెచ్చగొట్టే లాగా ఉందని.. ముస్లిం సమాజాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ.. జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని తోపాటు మరికొంతమంది వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. ఇలా దాఖలు చేసిన పిటీషన్లను విచారించిన తర్వాత హైకోర్టు సినిమా విడుదలకు ఒకరోజు (జూలై 11) ముందుగానే అభ్యంతరకరమైన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్ఈ సర్టిఫికెట్ కి వ్యతిరేకంగా సవరణ కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, అలాగే సవరణపై కేంద్రం తీసుకునే నిర్ణయం వరకు సినిమా విడుదలను ఆపివేయాలని హైకోర్టు పిటిషనర్లను కోరింది.


ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్..

అయితే సినిమా విడుదల కొన్ని గంటల ముందు హైకోర్టు ఇలా నిర్ణయం తీసుకోవడంతో నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు బుక్ అయ్యాయని, ముందస్తు టికెట్ల బుకింగ్లు అంగీకరించబడ్డాయని, సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు నుండి ఇలా స్టే ఆర్డర్ రావడం చాలా నష్టాన్ని మిగులుస్తుందని ఆయన తన వాదనను హైలెట్ చేశారు. అంతేకాదు కన్హయ్య లాల్ హత్య కేసులో నిందితుడు కూడా ఈ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన మరో పిటిషన్ ని కూడా కోర్టు స్వయంగా అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది అని కూడా నిర్మాత ఎత్తిచూపారు.

సుప్రీంకోర్టు ముందు తమ వాదన వినిపించిన నిర్మాతలు..

ఇక్కడ కోర్టు అడిగిన ఒక ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా..” ఈ సినిమాని సర్టిఫికేషన్ బోర్డు విడుదల చేయడానికి అనుమతించిందని కూడా ధర్మసనానికి తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..” ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ అనుమతించింది. నా దగ్గర ఆ సర్టిఫికెట్ కూడా ఉంది. ఇప్పటికే అన్ని థియేటర్లు బుక్ అయ్యాయి. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కేసు అని నేను కొంత బాధ్యతతో చెప్పాలి.అటు ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకొని విడుదలను నిలిపివేసింది” అంటూ ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తన బాధను తెలిపారు.

స్టేట్ విచారణపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నారంటే?

ఇకపోతే ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ స్టే ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు.. ఢిల్లీ కోర్టు ఇచ్చిన స్టే పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరగా.. ఆ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బుధవారం ‘ఉదయ్ పూర్ ఫైల్స్’ సినిమా స్టే పై విచారణ జరుపనున్నట్లు జస్టిస్ సూర్యకాంత్.. జోయ్ మాల్యా భగ్చీ తో కూడిన ధర్మాసనం తెలిపింది. మొత్తానికైతే బుధవారం జరగబోయే విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

ALSO READ:Telugu Heroes : రెమ్యునరేషన్‌కి న్యాయం చేయడంలో ఫెయిల్… ఈ జనరేషన్‌ హీరోలకు బ్యాడ్ నేమ్!

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×