K-Ramp Teaser Review : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలను కిరణ్ అబ్బవరం ఒకరు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు సాధించిన తర్వాత రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి హీరోగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత కిరణ్ చేసిన సినిమా ఎస్సార్ కళ్యాణ్ మండపం. కేవలం ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా తనలోని రైటర్ టాలెంట్ బయటకు తీసి డైలాగులు కూడా రాశాడు. కరోనా సెకండ్ వేవ్ లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ముఖ్యంగా కొన్ని బిల్డప్ సీన్స్ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి. ఎంట్రీ కూడా సినిమాలో చాలా బాగుంటుంది.
ఎస్సార్ కళ్యాణమండపం సినిమా మంచి సక్సెస్ సాధించిన తరువాత కిరణ్ అబ్బవరం కు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్, గీత ఆర్ట్స్ వంటి బ్యానర్స్ ముందుకు వచ్చి కిరణ్ అబ్బవరం హీరోగా సినిమాలు చేశారు. కానీ ఆ సినిమాలు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయాయి. ఆ తర్వాత ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయడానికి క అనే కాన్సెప్ట్ బేస్ సినిమాను ఎంచుకున్నాడు కిరణ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన దిల్రుబా సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో ఆడలేదు.
ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలో హీరోకి మంచి ఎలివేషన్స్ సీన్స్ ఉంటాయి. స్టోరీ తో పాటు మంచి ఫన్ కూడా ఆ సినిమాలో ఉంటుంది. అదే మాదిరిగా K-Ramp టీజర్ కూడా ఉంది. టీజర్ మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో కాన్సెప్ట్ కాకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. అయితే టీజర్ చివర్లో బిల్డప్ గురించి డైలాగ్స్ వేస్తూ తన గురించి తానే ఎలివేట్ చేసుకున్నాడు కిరణ్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. దాంట్లో ఆరోమాలే సాంగ్ కూడా మంచి హిట్.
K-Ramp టీజర్ మొదలవ్వగానే ఆరోమాలే అని అరుస్తాడు కిరణ్ అబ్బవరం. అయితే ఇది కూడా కేరళ బ్యాక్ డ్రాప్ లో జరగబోయే స్టోరీ అని టీజర్ పెట్టి అర్థమవుతుంది. ఈ సినిమా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ టీజర్ చూస్తున్నంత సేపు ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అని చెప్పాలి. ఆ సినిమాలో ఉన్న కొన్ని మూమెంట్స్ దీనిలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
Also Read : Super Raja Movie : థియేటర్‌లోనే నీ G*** పగలకొడుతాం… హీరో మొహం మీద ఫ్యాన్ డెడ్లీ వార్నింగ్