Pat Cummins : సాధారణం గా ఈ మధ్య కాలంలో పలువురు క్రికెటర్లు ఎక్కువగా గాయాలపాలవుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, బుమ్రా, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్ వంటి ఆటగాళ్లు గాయాల పాలైన విషయం తెలిసిందే. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కూడా కెప్టెన్ బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, ఆర్చర్ ఇలా చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. తాజాగా యాషెస్ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ఈ మేజర్ సిరీస్ కి దూరం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా తనికి వెన్నుపాము దిగువ భాగంలో నొప్పితో కమిన్స్ కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం విధితమే. అయితే ఆసిస్ జట్టు అంతా జూన్, జులై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. కానీ కమిన్స్ మాత్రం ఫిట్ నెస్ సమస్యలతో స్వదేశంలోనే ఉండిపోయాడు.
Also Read : Vizag Girl : ‘అంధ’ కార బంధురం నుంచి క్రికెట్ లో వరల్డ్ కప్ వరకు..!
అప్పటి నుంచి ఇంతవరకు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. అంతేకాదు.. అక్టోబర్ లో న్యూజిలాండ్, టీమిండియా జట్లతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కి కూడా దూరమయ్యాడు కమిన్స్. మరోవైపు ఇంగ్లాండ్ తో యాషెస్ టెస్ట్ సిరీస్ కి తగినంత విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మేనేజ్ మెంట్ తమ కెప్టెన్ విషయంలో ఈ మేరకు జాగ్రత్తలను తీసుకుంది. అయితే తాను యాషెస్ సిరీస్ కూడా ఆడుతానో లేదో అని తాజాగా కమిన్స్ పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడారు కమిన్స్.. “ఇప్పటివరకు నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాను. అయితే గాయం నుంచి 100 శాతం కోలుకున్నానని మాత్రం చెప్పలేను. యాషెస్ నుంచి మళ్లీ మైదానంలోకి దిగాలని ఆశిస్తున్నా. కానీ ఈ విషయం పై ఇప్పుడే స్పష్టత మాత్రం ఇవ్వలేను. యాషెష్ సిరీస్ లో ఆడాలనే భావిస్తున్నాను.
యాషెస్ సిరీస్ షెడ్యూల్ :
అయితే యాషెస్ టెస్ట్ సిరీస్ లో 5 టెస్ట్ మ్యాచ్ లు ఆడుతానో లేదో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం” అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఈ సారి ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్ తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య నవంబర్ 21 నుంచి జనవరి 08 వరకు 5 టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ నవంబర్ 21 నుంచి 25 వరకు పెర్త్ లో జరుగనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 4 నుంచి 8 వరకు బ్రిస్బెన్ లో, మూడో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఆడిలైడ్ లో, నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్ బోర్న్, ఐదో టెస్ట్ జనవరి 04 నుంచి 8 వరకు సిడ్నీ లో జరుగనుంది యాషెస్ టెస్ట్ సిరీస్.