E-Paper
Advertisement

Kissik Talks Show : సిద్ధు వల్ల బాగా ఏడ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పు…

Kissik Talks Show : సిద్ధు వల్ల బాగా ఏడ్చేశాను.. అదే నేను చేసిన పెద్ద తప్పు…
Advertisement

Kissik Talks Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు సరికొత్త ప్రోగ్రాంలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.. ఈమధ్య ఈ ఛానల్ లో కిసిక్ టాక్స్ అనే షో ప్రసారం అవుతుంది.. ఆ షోకి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు గెస్ట్లుగా విచ్చేసి తమ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. అంతేకాదు తమ అభిప్రాయాలని కూడా చెప్పుకొచ్చారు. ఈ షో వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవడంతో ఆ వీడియోని చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక తాజాగా  కిస్సిక్ టాక్స్ షోకు సినీ నటి సోనియా గెస్టుగా వచ్చింది.. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. సిద్దు తో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయింది.. అంతేకాదు తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని క్లిష్టమైన పరిస్థితుల గురించి కూడా వివరించింది. మరి సోనియా జీవితంలో ఎదురైనా అనుకోని సంఘటనలు ఏంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

సిద్ధు మాటతో బాగా హర్ట్ అయ్యాను..

సినీ నటి సోనియా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు యూట్యూబ్లో  వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారినా ఈ ముద్దుగుమ్మ.. తన టాలెంట్ తో సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది.. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇక సోనియా తన యూట్యూబ్ పార్టనర్ అయిన సిద్దుతో లవ్ లో ఉందన్న విషయం తెలిసిందే.. ఇటీవల స్టార్ మా నిర్వహించిన కపుల్ షో లో కూడా వీళ్లిద్దరు పార్టీసీపీట్ చేశారు.. తాజాగా ఈమె బిగ్ టివి నిర్వహించిన కిస్సిక్ టాక్స్ షోకి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జర్నీ గురించి ఎన్నో విషయాలను పంచుకున్న సోనియా మొదట్లో సిద్దు వల్ల తను చాలా బాధపడిన విషయాన్ని కూడా బయటపెట్టింది.. సిద్దు కి కోపం ఎక్కువ ఏదైనా వెంటనే అనేస్తాడు దానివల్ల నేను చాలా హర్ట్ అయ్యాను అని సోనియా చెప్పుకొచ్చింది.. అయితే అప్పట్లో తనని అర్థం చేసుకోలేదు.. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా జర్నీని ముందుకు తీసుకుని వెళుతున్నాము అని సోనియా చెప్పింది..

అందరిని గుడ్డిగా నమ్మేస్తాను..

Advertisement

మనం ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకుని మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయొచ్చు.. కానీ మనతో ఉంటూనే మన వెనకాల గోతులు తవ్వే వాళ్లతో జాగ్రత్తగా ఉండడం మంచిది అని సోనియా తెలిపారు.. మొదట్లో నేను అందరిని గుడ్డిగా నమ్మాను.. ఆ తర్వాత పెళ్లి కాకుండానే వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అలాంటి వార్తలు వాళ్ళ నోటి నుంచే వినడంతో చాలా బాధపడిపోయాను.. అప్పుడే నాకనిపించింది ఎవరు నీ గుడ్డిగా నమ్మొద్దు అని. ఎవరిని అనుకున్న కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము అని సోనియా అన్నారు.. తన తెలుగు గురించి అందరూ ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని వర్షా చెప్పగా సోనియా ఒక్కసారిగా నవ్వుకొని దానిపై ఆమె వివరణ ఇచ్చింది.. ఎప్పుడూ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు.. కొన్నిసార్లు వాళ్లే మనల్ని గుండెలు పిండేసే బాధని మిగులుస్తారని ఆమె అన్నారు.. ప్రస్తుతం మేము చాలా హ్యాపీగా ఉన్నాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని క్లారిటీ ఇచ్చింది.. ఈనెల సెప్టెంబర్ లో వీళ్ళ పెళ్లి జరగనున్నట్లు తెలిపింది. త్వరలోనే తమ పెళ్లి గురించి ప్రకటించబోతున్నట్లు కూడా సోనియా చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం కిస్సిక్ టాక్స్ ఎపిసోడ్ వీడియో వైరల్ అవ్వడంతో సోనియా, సిద్దు పెళ్లి పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు..

Related News

మేము గుర్తులేమా? ఖుష్బూపై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్!

అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

రఘువరన్ మృతికి కొడుకే కారణమా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బాలాజీ!

టాలీవుడ్ వీకెండ్ వార్ .. బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ?

లాటరీ కొట్టిన రెజీనా కసాండ్రా.. లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్!

నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!

Big Stories

Advertisement
×