E-Paper
Advertisement

వందే భారత్ క్రేజీ ఫుడ్ మెనూ.. బ్రేక్‌ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా?

వందే భారత్ క్రేజీ ఫుడ్ మెనూ.. బ్రేక్‌ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా?
Advertisement

Vande Bharat Food Menu 2026: ఇండియన్ రైల్వేలో అత్యంత ప్రీమియం రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో ప్రయాణం మాత్రమే కాదు, ప్రయాణికులకు అందించే ఫుడ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రయాణించే రూట్, టైమ్, ప్రయాణ వ్యవధిని బట్టి మెనూలో పలు ఛేంజెస్ ఉంటాయి. అయినప్పటికీ శుభ్రత, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రయాణికులకు చక్కటి టేస్టీ ఫుడ్ అందిస్తారు.

బ్రేక్ ఫాస్ట్ లో ఏం అందిస్తారంటే?

ఉదయం పూట వందేభారత్ రైళ్లలో బ్రేక్ ఫాస్ట్ సాధారణంగా ఇడ్లీ, వడ, ఉప్మా, పోహా లాటంటి సౌత్ ఇండియన్ ఫుడ్స్ అందిస్తారు. కొన్ని రూట్లలో వెజ్ కట్లెట్, ఆమ్లెట్ కూడా ఇస్తారు. వీటితో పాటు బ్రెడ్, వెన్న, జామ్, టీ, కాఫీతో పాటు ఓ జ్యూస్ బాక్స్‌ ను కూడా అందించడం సాధారణంగా కనిపిస్తుంది. తక్కువ దూర ప్రయాణాలకు భోజనం కాకుండా లైట్  స్నాక్స్ ఇస్తారు. ఇందులో వెజ్ శాండ్‌ విచ్, వెజిటబుల్ పఫ్, సమోసా, కచోరీ, మఫిన్, కుకీలు లాంటి ఐటెమ్స్ ఇస్తారు. వీటితో పాటు వేడి టీ లేదంటే కాఫీ అందించి ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తారు.

భోజనంలో ఏ ఐటెమ్స్ ఉంటాయంటే?

Advertisement

సుదూర ప్రయాణాల్లో మధ్యాహ్నం, రాత్రి భోజనంగా పూర్తి వెజ్ థాలీ అందిస్తారు. ఇందులో అన్నం, పప్పు, పనీర్,  మిక్స్డ్ కర్రీ, చపాతీ, పెరుగు, పచ్చడితో పాటు స్వీట్ కూడా ఉంటుంది. ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి కూరలు, ఇతర వంటకాలలో కొంత మార్పు ఉంటుంది.

నాన్ వెజ్ లవర్స్ కోసం స్పెషల్ మెనూ

మాంసాహారం తీసుకునే ప్రయాణికుల కోసం ప్రత్యేక మెనూ ఉంటుంది. సాధారణంగా చికెన్ కర్రీ,  చికెన్ గ్రేవీని అన్నం,  చపాతీతో కలిపి అందిస్తారు. దీనికి సలాడ్, పెరుగు, డెజర్ట్ కూడా యాడ్ చేస్తారు. విమానాల్లో అందించే భోజనానికి ఏమాత్రం తీసిపోని ఎక్స్ పీరియెన్స్ అందిస్తారు. భోజనం తర్వాత గులాబ్ జామ్, రసగుల్లా, ఖీర్, ఫ్లేవర్డ్ యోగర్ట్  లాంటి స్వీట్స్ అందిస్తారు. ఈ స్వీట్లు ప్రయాణికులకు హోమ్ ఫుడ్ అనుభూతిని కలిగిస్తాయి.

లోక్ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత

Advertisement

వందే భారత్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి రూట్‌కు అనుగుణంగా మెనూ ఉంటుంది. సౌత్ ఇండియన్ రూట్లలో స్థానిక ఫుడ్ కు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నార్త్ ఇండియన్ రూట్లలో అక్కడి రుచులకు తగ్గట్టుగా థాలీలు సిద్ధం చేస్తారు. ముంబై–పుణే, ఢిల్లీ–వారణాసి, ఇతర మార్గాల్లో ప్రయాణించినా ప్రతి రూట్‌ లో మెనూలో కాస్త డిఫరెన్స్ ఉంటుంది. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో వేగవంతమైన ప్రయాణమే కాదు, క్వాలిటీ ఫుడ్ కూడా లభిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ప్రయాణికుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని మెనూను రూపొందించడం ఈ రైలుకు మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

Read Also: 13 దేశాలు చుట్టేసే ఏకైక రైలు.. దీని టికెట్ ధర ఎంతో తెలుసా?

Related News

రోజంతా కొండపై కూర్చుంటాడు.. నెలకు రూ.8.5 లక్షలు సంపాదిస్తాడు?

గుడిని చుట్టుకున్న చేప.. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

ఏఐ To బయోమెట్రిక్.. స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌.. గ్లోబల్ కనెక్టివిటీ!

ప్యారిస్ వెళ్లాల్సిన పనిలేదు.. హైదరాబాద్‌లోనే ఐఫిల్ టవర్‌పై కూర్చొని ఐస్‌క్రీమ్ తినొచ్చు!

ఇక ఉబెర్ యాప్‌లో ట్రైన్ టికెట్ల బుకింగ్.. PNR స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు!

చిక్కుల్లో నవదీప్.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?

ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి 50 వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

రోజు రోజుకు తగ్గుతున్న రైల్వే ఫుడ్ బుకింగ్స్.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×