OG Business : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీ మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత ఓజీ కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓజీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.. అదే రోజున బాలయ్య అఖండ 2 కూడా రిలీజ్ కాబోతుంది. ఇద్దరు స్టార్ హీరోలు కావడంతో ఫ్యాన్స్ దసరా విన్నర్ ఎవరో తెలుసుకోవాలని ఇప్పటి నుంచే ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.. అయితే తాజాగా ఈ మూవీ బిజినెస్ వివరాలు బయటకు వచ్చాయి.. ఓజీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయిందని ఇండస్ట్రీలో టాక్. ఆ బిజినెస్ వివరాలను ఒకసారి తెలుసుకుందాం..
‘ఓజీ’ బిజినెస్ ..?
పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఆ మాత్రం లెక్క ఉంటుంది. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ఊహించడం కష్టం.. హరిహర వీరమల్లు మూవీ బిజినెస్ భారీగానే జరిగింది. ఇప్పుడు ఓజీ మూవీకి అంతకు మించి జరిగిందని తెలుస్తుంది. విషయానికొస్తే.. సాధారణంగా ఏ సినిమా అయినా ఆంధ్రలో ఒక్కో ఏరియాకు ఇంత పర్సంటేజ్ లెక్కన ఉంటుంది. అలాగే టోటల్ అమౌంట్ ఇంత అనుకుంటే ఒక్కో ఏరియా ఆ పర్సంటేజ్ ప్రకారం రేటు ఫిక్స్ అవుతుంది. ఈ లెక్కన ఓజి ఆంధ్ర 80 కోట్లు అనుకుంటే విశాఖ 24 పర్సంట్ వంతున రేటు ఫిక్స్ అవుతుంది. కానీ గట్టి పోటీ వుండడం వల్ల విశాఖ,ఈస్ట్, గుంటూరు, మూడు ఏరియాలు రెండు నుంచి మూడు పర్సంట్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన విశాఖ 26 లేదా 27 పర్సంట్ అయిందన్నమాట. అలాగే ఈస్ట్ 16 నుంచి 18 పర్సంట్ కు పెంచారని టాక్. ఇక గుంటూరు పరిస్థితి కూడా అంతే.. నెల్లూరు కూడా 9 పర్సంట్ కు పెంచినట్లు తెలుస్తుంది. వైజాగ్..21.80 కోట్లు పడింది
ఈస్ట్ గోదావరి ఎంపీ ఉదయ్ ఆయన మిత్రులు కలిసి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర 19.20 కోట్లు వీరాంజనేయ ఫిలింస్ & శ్రీదత్త కార్తికేయ ఫిలింస్ తో కలిసి కొనుగోలు చేశారు. నైజాం 70 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నారు. సీడెడ్ లో నాగ వంశీ రైట్స్ కొనుగోలు చేశారు. మొత్తానికి ఈ బిజినెస్ చూస్తుంటే ఓజీ బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే విడుదలకు ముందే కోట్లు వసూల్ చేసింది. రిలీజ్ అయ్యాక కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
Also Read : బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది
ముంబై ‘గ్యాంగ్ స్టర్’ గా పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ ‘ఓజీ` మూవీ ముంబాయి గ్యాంగ్ స్టర్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నారు. సినిమాలో మహిళా సెంటిమెంట్, బ్రదర్, సిస్టర్స్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు ఇలాంటి సెంటిమెంట్, ఎమోషన్స్ బలంగా ఉంటాయని, అదే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని వెల్లడించారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ మరింత ఆతృతతో ఎదురుచూస్తున్నారు. .పవన్ ఎక్కడ పబ్లిక్ మీటింగ్‌లో కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తుంటారు. ఈ లెక్కన చూస్తే మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ పవన్‌కి జోడీగా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు..