BigTV English

Peddi Movie : బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది

Peddi Movie : బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది

Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది.. టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. జగపతి బాబు కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ మూవీ నుంచి శివన్న బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


శివన్న బర్త్ స్పెషల్ పోస్టర్..

రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలో కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆయన లుక్ పోస్టర్ ను పెద్ది టీమ్ రిలీజ్ చేసింది. హ్యాపీ బర్తడే కరుణాడ చక్రవర్తి అంటూ ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ లో గంభీరంగా కోపంగా చూస్తున్నట్లుంది. పెద్ద మీసాలు, కండువా తో పాటుగా చెవికి పోగులతో కరుడుగట్టిన విలన్ గా కనిపిస్తున్నాడు.. పోస్టర్ని చూస్తుంటే ఈ మూవీలో ఈయన క్యారెక్టర్ మాస్ లుక్ లో ఉండేలా కనిపిస్తుంది..


పెద్ది మూవీ అప్డేట్స్..

రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. గతంలో రామ్ చరణ్ ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయింది. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమాపై ఫాన్స్ నిరాశన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. పెద్ది చిత్రం కథ చాలా యూనిక్ గా ఉంటుందని, ఆర్ఆర్ఆర్, రంగస్థలం వంటి చిత్రాలకు మించిన కథను చెప్పబోతున్నామని అన్నారు. ఇక రంగస్థలం చిత్రం తో రామ్ చరణ్ నటన, బాక్సాఫీస్ నెంబర్స్ లో సక్సెస్ సాధించారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన అప్డేట్ పై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ ఈ సినిమాకి హైలైట్ గా అవుతుందని తెలుస్తుంది..

బడ్జెట్ ఎంతంటే..?

రామ్ చరణ్ పెద్ది చిత్రాన్ని రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీగా ఆర్ రత్నవేలు, ఎడిటర్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి, సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ పనిచేస్తుండటం విశేషం. ఈ కారణంగా సినిమాకు భారీగానే ఖర్చు అవుతోంది.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను డబ్బింగ్ పనులను పూర్తి చేయాలని ఆలోచనలు యూనిట్ ఉన్నారట..

Also Read :రెడీ పెళ్లికి రెడీ అవుతున్న బుల్లితెర నటి.. ఇదిగో క్లారిటీ ఇచ్చేసిందిగా..!

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గ్లోబల్ స్టార్ డేట్స్ కోసం టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్, సుకుమార్, గౌతమ్ తిన్ననూరి, నిర్మాత దిల్ రాజ్ వెయిటింగ్ లో ఉన్నారు.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ చెయ్యనున్నారు..

Related News

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Nag Ashwin: కల్కి లో ఆ స్టార్లు కలెక్షన్స్ కోసం కాదు… అయ్యో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరువు తీశాడే!

Lokesh kanagaraj : ఫ్యూచర్ లో అతను లేకుండా సినిమా చేయను, లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్

OG – Pawankalyan: అసలు పండుగ రేపు మొదలుకానుంది, పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే

Peddi First Single: పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Janhvi Kapoor: శ్రీదేవి హిట్ సినిమా రీమేక్ ఆలోచనలో జాన్వీ… వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×