Kollywood : కొలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.. ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ కన్న తల్లి ఇవాళ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె ఇవాళ తుదిశ్వాస విడిచారు.. అజిత్ మోహిని వయసు 84 సంవత్సరాలు. కొన్ని రోజులుగా ఈమె అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.. ఇవాళ ఉదయం ఆమె తన నివాసంలోనే స్వర్గస్తులయ్యారు. హీరో అజిత్ తల్లి మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు సన్నిహితులు, బంధువులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేడు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.. కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీ నుంచి భారీగా ప్రముఖులు హాజరు కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె అంత్యక్రియల గురించి పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తల్లి మోహిని గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.. ఈ మధ్యనే ఆసుపత్రిలో కూడా చేర్పించి చికిత్సను అందించారు. కానీ ఆమె నివాసంలోనే ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు.. అజిత్ తల్లి చనిపోయిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో విషాదాన్ని మిగిల్చింది. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.. నేడు మోహిని అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఇకపోతే గత మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి చనిపోయారు. వృద్ధాప్య సమస్యల వల్లే స్వర్గస్తులయ్యారు. తండ్రి.. తల్లి కూడా మరణించడంతో అజిత్ కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి లేరనే వార్తను పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు తల్లి కూడా చనిపోవడంతో అజిత్ తీవ్ర దుఃఖంలో మునిగిపోతున్నారు.. ఇప్పుడు తల్లి లేదా వార్తను హీరో అజిత్ జీర్ణించుకోలేకపోతున్నాడు.
Also Read :పాడుపడ్డ స్థితిలో దాసరి సమాధి.. బిగ్ టీవీ యాంకర్ పోస్ట్ పై మనోజ్ రియాక్ట్..
హీరో అజిత్ మొన్నటివరకు రేసింగ్ వల్ల బిజీగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా తన ప్రాజెక్ట్లను లైన్లో పెట్టుకుంటూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన దుబాయిలో ఉన్నారు.. తల్లి మరణ వార్త విన్న వెంటనే దుబాయ్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు అజిత్.. తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. ప్రస్తుతం ఈయన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో ఓ మూవీ చేస్తున్నారు. ఇంతపాటుగా మరో రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమాల గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.. ప్రస్తుతం తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న ఆయన కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం..