Dasari Narayana Rao : టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణ రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో వందల చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈయన ప్రస్తుతం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన తెరకెక్కించిన సినిమాలు గుర్తు చేస్తూనే ఉంటాయి. డైరెక్టర్గా, నిర్మాతగా, నటుడుగా మాత్రమే కాదు. డైలాగ్స్ రచయితగా ఆయన పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.. వందలాది సినిమాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించారు.. ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి అనారోగ్య సమస్యల కారణంగా 2017లో కన్నుమూశారు. తెలుగు ఇండస్ట్రీ ఒక లెజెండరీ డైరెక్టర్ ను మిస్ అయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన సమాధి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ టివి యాంకర్ పోస్ట్ చేసిన ఆ వీడియో పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సమాధి వద్ద క్లీనింగ్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.. కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు సమాధి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ యాంకర్ సమాధి వీడియోను సోషల్ మీడియాలో ఖాతాల్లో పంచుకున్నారు. ఆ వీడియో పై సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ ఈ వీడియో పై రియాక్ట్ అయ్యారు. మనోజ్ దాసరి నారాయణ రావు సమాధి వద్దకు వెళ్లినట్లు తెలుస్తుంది.. దాసరి నారాయణరావు సమాధిని ఇలా చూడటం చాలా బాధగా ఉందని అన్నారు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసి, చాలా జనరేషన్లకు ఆదర్శంగా నిలిచిన ఆయన సమాధిని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read :పెళ్లి పీటలు ఎక్కబోతున్న యష్మీ.. సడెన్గా ఈ ట్విస్ట్ ఏంటి..?
దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధిని సందర్శించారు సినీ ప్రముఖులు. సమాధి వద్ద ఉన్న చెట్లు చెత్త చెదరని క్లీన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సంస్థతో పాటుగా.. హీరో మంచు విష్ణు కూడా ముందుకు వచ్చారు. వ్యక్తులను పంపించి క్లీనింగ్ పనులను మొదలుపెట్టారు.. అయితే దాసరి నారాయణరావు గారితో పాటుగా ఆయన భార్య సమాధి కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండడంతో చూసిన ఆ వీడియోని చూసిన కొందరు అభిమానులు బాధపడుతున్నారు. ఎందుకు అలాంటి గొప్ప వ్యక్తుల సమాధులను వదిలేశారు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. వేల కోట్ల ఆస్తులు ఇచ్చినా దాసరి కుటుంబ సభ్యులు కనీసం వారి సమాధులను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.. నేడు దాసరి నారాయణరావు వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు..
దాసరి సమాధి దుస్థితిపై స్పందించిన హీరో మంచు మనోజ్
సమాధిని ఇలా చూస్తానని అనుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ https://t.co/lpB1QJHbe8 pic.twitter.com/llJze2Eazp
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2026