E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?
Advertisement

Kollywood:పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్క మహిళ పిల్లల్ని కని.. తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటుంది .
అయితే పిల్లల్ని కనడానికి పెళ్లితో సంబంధం ఏంటి? అని అడిగే సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. మరికొంతమంది పిల్లలే వద్దు అంటూ ఒత్తిడి తెచ్చిన భాగస్వాములతో విడాకులకు సిద్ధమవుతున్నవారు కూడా ఉన్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలకు తగ్గట్టుగా తమ జీవితాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు పెళ్లే వద్దన్న ఒక బ్యూటీ ప్రస్తుతం పెళ్లిపై తన అభిప్రాయాలను మార్చుకుందేమో తెలియదు కానీ ప్రస్తుతం అలాంటి మగాడు దొరికితే బిడ్డను కంటాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

బిడ్డల్ని కనాలనుంది – ఐశ్వర్య లక్ష్మి

ఆమె ఎవరో కాదు ఐశ్వర్య లక్ష్మి. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ గట్ట కుస్తీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గట్టకుస్తీ 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. జూలై 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితం, పెళ్లి గురించి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ..” గట్ట కుస్తీ 2 సినిమా షూటింగ్ సమయంలో ఒక చిన్నారితో గడిపే అవకాశం వచ్చింది. ఆ పాపకు దగ్గర అయినప్పుడు నాలోని మాతృత్వపు భావాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక నాలో కలిగింది అంటూ కామెంట్ చేసింది. ఈ వార్తలు విన్న నెటిజన్స్ ఒకప్పుడు పెళ్లి పై నమ్మకం లేదు.. పెళ్లి వద్దున్న బ్యూటీ ఇప్పుడు పిల్లల్ని కనాలని ఉంది అని అంటోంది ఏంటి ?అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

also read:జైలర్ 2 రిలీజ్ డేట్.. కౌంట్ డౌన్ మొదలుపెట్టిన మేకర్స్!

అలాంటి వాడు భర్తగా దొరకాలి – ఐశ్వర్య లక్ష్మి

ఇదే ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. “ఆ పాపను దగ్గరగా చూసిన తర్వాత నాలోని మాతృత్వపు లక్షణాలు మేల్కొని ఒక బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక కలిగింది. అందుకే నాకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలి అంటే.. భవిష్యత్తులో నాకంటూ ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను కాబట్టి.. కనీసం నా పిల్లలకు ఒక మంచి తండ్రి అవుతాడనే నమ్మకం నాలో కలగాలి. ఏ కష్టం వచ్చినా నన్ను వదిలి పారిపోని ఒక తోడు దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అలాంటి వ్యక్తితోనే నేను ఒక బిడ్డను కని , మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తాను అంటూ ఐశ్వర్య లక్ష్మి కామెంట్లు చేసింది.

ఐశ్వర్య లక్ష్మీ కెరియర్..

Advertisement

ఐశ్వర్య లక్ష్మీ విషయానికొస్తే.. కేరళకు చెందిన మలయాళ బ్యూటీ.. మోడలింగ్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసింది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి తమిళంలో జగమే తందిరం, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలలో నటించిన ఈమె ఇప్పుడు గట్ట కుస్తీ 2 చిత్రంతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను తెలుగులో మట్టి కుస్తీ 2 పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Related News

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!

లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

జైలర్ 2 రిలీజ్ డేట్.. కౌంట్ డౌన్ మొదలుపెట్టిన మేకర్స్!

నోలన్ మార్క్ విజువల్ వండర్: ‘ది ఒడిస్సీ’ ఫైనల్ ట్రైలర్ అవుట్.

దుల్కర్ సల్మాన్ కు చుక్కెదురు..కార్ స్మగ్లింగ్ కేసులో అలాంటి ప్రశ్నలు!

Big Stories

×