NMC Inspection: స్వేచ్ఛబ్యూరో: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న ది. గతంలో నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల సందర్భంగా ప్రతీ సారి ఏదో ఒక కాలేజీపై కొర్రీలు పెట్టేవారు. కానీ ఫస్ట్ టైమ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై ఎన్ ఎంసీ ఎలాంటి కొర్రీలు పెట్టకుండానే తన విజిట్ లను ముగించింది. గతంల కొర్రీలు పెట్టడం, సీట్ల కేటాయింపుపై సందిగ్ధత సృష్టించడం నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ లలో కామన్‌గా జరిగేది. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. తెలంగాణలోని సర్కారీ వైద్య కళాశాలల పనితీరు, మౌలిక వసతులపై ఎన్ఎమ్‌సీ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది.ఎలాంటి మేజర్ అబ్జెక్షన్లు (ఆటంకాలు)లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు ప్రభుత్వం,ఇటు వైద్యాధికారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎన్ఎమ్‌సీ బృందం పర్యటన వస్తోందంటేనే కాలేజీల ప్రిన్సిపాళ్లు, వైద్యాధికారుల్లో ఒకటే టెన్షన్. ఎక్కడ ఏ లోపాన్ని ఎత్తిచూపుతారో, ఏ కాలేజీ సీట్లకు కత్తెర వేస్తారో అన్న ఆందోళన ఉండేది. కానీ, ఈసారి జరిగిన ముమ్మర తనిఖీల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. కాలేజీ బిల్డింగులు, హాస్టళ్లు, ల్యాబ్‌ల నిర్వహణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ఎన్ఎమ్‌సీ నిర్ధారించింది. అంతేగాక ల్యాబొరేటరీలు, ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటంపై బృందం సభ్యులు ప్రశంసలు కురిపించారు. గతంలో ఫ్యాకల్టీ కొరత పెద్ద మైనస్‌గా ఉండేది. కానీ ఈసారి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్లు సక్రమంగా జరగడంతో వంద శాతం స్ట్రైక్ రేట్ నమోదైంది.
గత ఏళ్లతో పోలిస్తే ఈసారి వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. బయోమెట్రిక్ అటెండెన్స్, సీసీటీవీ కెమెరాల అనుసంధానం,రోగుల సంఖ్య వంటి ప్రతి అంశంలోనూ తెలంగాణ సర్కారు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించింది. ఎన్ఎమ్‌సీ విజిట్ ముగిసిన తర్వాత ఎలాంటి మేజర్ రీమార్క్స్లేకపోవడం ఆఫీసర్లను సైతం ఆశ్చర్యపరిచింది.”తెలంగాణ వైద్య విద్య చరిత్రలో ఫస్ట్ టైమ్ ఎన్ఎమ్‌సీ ఎలాంటి తిరకాసులు పెట్టకుండా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది తమ ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ, వైద్యుల కష్టానికి దక్కిన గుర్తింపు.” అంటూ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది.
Also read: చర్చకు రాకుండా మంత్రులు పారిపోయారన్న కేటీఆర్, మరొక ఛాలెంజ్ విసిరిన మంత్రి జూపల్లి
ఈ సానుకూల పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్ఎమ్‌సీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రాబోయే విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగనుంది. పేద విద్యార్థులకు సొంత రాష్ట్రంలోనే నాణ్యమైన వైద్య విద్యనభ్యసించేందుకు మరిన్ని అవకాశాలు మెరుగయ్యాయి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, నిరంతర నిధుల విడుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని, భవిష్యత్తులోనూ ఇదే నాణ్యతను కొనసాగిస్తామని వైద్యాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్ నగర్ , నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది.రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడో విడుతగా రాజన్న సిరిసిల్ల,వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, నాలుగో విడతగా జోగులాంబ గద్వాల్,నారాయణ్ పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లా లోని కుత్భుల్లాపూర్ లో మెడికల్ కాలేజీల కోసం గత సర్కార్ దరఖాస్తు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చిన తర్వాత అన్ని కాలేజీలకు ఎన్ ఎంసీ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఆయా కాలేజీలను కొనసాగిస్తున్నది.
అయితే ఇందులో ఫస్ట్ ఫేజ్ లో నిర్మించిన కాలేజీలు మినహా మిగతావాటికి శాశ్వత ప్రాతిపాదికన కాలేజీలు, ఆసుపత్రులు లేవు. అన్ని కాలేజీలను టెంపరరీ బిల్డింగ్‌లు, అటాచ్ ఆసుపత్రులతో నెట్టుకొచ్చారు. అంతేగాక స్టాఫ్ సమస్య, ఫ్యాకల్టీ సమస్య వేధించింది. దీంతో పాటు ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఎన్ ఎంసీ నామ్స్ ప్రకారం ల్యాబ్స్ ను తీర్చిదిద్దలేదు. వీటన్నింటిపై రివ్యూ చేసిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర ఒక్కొక్క అంశాన్ని మానిటరింగ్ చేస్తూ కాలేజీలను స్టాంటర్టైజ్ చేశారు. స్టాఫ్ సమస్యకు చెక్ పెట్టేందుకు డీఎంఈ విభాగంలో వేగంగా ప్రమోషన్లు కల్పించి, సీనియారిటీ ప్రకారం పోస్టింగ్ లకు అవకాశం ఇచ్చారు. ఇక ప్రత్యేక నిధులతో కాలేజీలను బలోపేతం చేశారు. దీంతో దఫా జరిగిన ఎన్ ఎంసీ విజిట్ లో సర్కార్ కు సంతృప్తినిచ్చింది.
Also read: Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!