Korean Kanakaraju Trailer:వరుణ్ తేజ్ .. తొలి సినిమా ముకుందతో మంచి మార్కులే వేసుకున్నాడు.ఇక మా మెగా ఫ్యామిలీ నుండి మరో ప్రామిసింగ్ హీరో వచ్చాడ్రోయ్ అంటూ మురిసిపోయారు మెగా ఫ్యాన్స్.ఇక తర్వాత వచ్చిన కంచె కూడా విమర్శకుల ప్రశంసలు పొందడంతో ఈ కుర్రాడు ఇండస్ట్రీలో పాతుకుపోయెలానే ఉన్నాడు అనుకున్నారు అంతా.కానీ అది అప్పటి వరకే అంటూ ఒక లోఫర్, మిస్టర్ సినిమలాతో వరుస ఫ్లాపులని ఫేస్ చేశాడు.అయితే వీటికి ఎండ్ కార్డ్ శేఖర్ కమ్ములతో కలిసి ఆడియన్స్ ని ఫిదా చేశాడు వరుణ్.ఇక తొలిప్రేమ తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు అని మురిసే లోపే అంత్యరిక్షంతో మరోసారి ఆకాశం నుండి నేలకి పడిపోయాడు.
అయితేనేం f2తో మరోసారి గట్టిగా నిలబడి గద్దలకొండ గణేష్ తో బాక్సాఫీస్ వద్ద గర్జించిన వరుణ్ ఆ తర్వాత హిట్ అడ్రస్ పట్టుకోలేక అడ్డదిడ్డంగా వెళ్ళిపోయాడు.f౩ తో పర్లేదనిపించినప్పటికీ అది కాస్తా వెంకీ మామ ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి.ఇక ఆ తర్వాత మొదలైన ప్లాపుల ప్రయాణం ఇప్పటి ఆపలేకపోతున్నాడు వరుణ్. సినిమా తీస్తే అట్టర్ ప్లాప్ అన్నట్టుగా ఘని తో మొదలెట్టి, గాండీవ దారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా అంటూ వరుస ప్లాపులని మూటగట్టుకున్నాడు.
కొరియన్ కనకరాజు అయినా కాపాడతాడా
అయితే వీటికి ఎలాగైనా బ్రేక్ వేయాలంటూ సరికొత్త హర్రర్ థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయ్యాడు ఈ మెగా ప్రిన్స్. ఆ క్రమంలో చేసిన సినిమానే కొరియన్ కనకరాజు. వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 7న ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేస్తుంది.ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో వేగం పెంచిన మేకర్స్ తాజాగా మూవీ నుండి ట్రైలర్ వదిలారు.ఇక ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం విశేషం.అయితే ట్రైలర్ ఇలా వచ్చిందో లేదో సినిమా ఎలా ఉంటుందో అంటూ స్కాన్ చేయడం మొదలెట్టారు నెటిజన్లు.
అంచనాలు పెంచిన ట్రైలర్
ట్రైలర్ లో చూస్తె మొదట్లో కామెడీ కామెడీగా సాగిన కథలో ఒక్కసారిగా భయపెట్టే సీన్స్ తో టర్న్ తీసుకోవడం కాస్త ఇంట్రెస్ట్ ని పెంచేసింది.ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సత్యా కి ఈ సినిమాలో హీరోకి సమానమైన రోల్ దక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.అది పేలితే మాత్రం ఆడియన్స్ క్యూ కట్టడం పక్కా..అయితే వరుణ్ తేజ్ కూడా ఈసారి తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా అందులోనూ ఎప్పుడు చేయని మల్టీ పర్సనాలిటీ రోల్ ని ఇందులో చేస్తుండడటం తో మెగా ఫ్యాన్స్ లో అంచానాలు పెరిగిపోతున్నాయి.
also read :‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !
ఇక తేజ సజ్జాతో తో మిరాయ్ లో ఆడిపాడి ఆడియన్స్ మనసు దోచుకున్న రితికా నాయక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యేలానే కనిపిస్తుంది.ఈ సినిమాలో కొన్ని హారర్ షాట్స్, మిస్టరీ ఎలిమెంట్స్, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి థియేటర్లలో మంచి అనుభూతి ఇస్తాయనే ఫీలింగ్ అయితే మూవీ లవర్స్ లో కనిపిస్తుంది.
కామెడీ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది
అయితే “ఈసారి కథ కొత్తగా కనిపిస్తోంది”, “హారర్ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది” అని కొందరు ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకొందరు మాత్రం “దీనితో అయినా హిట్ కొడతావా వరుణ్?”, “ప్రతి సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ అదిరిపోయిందనే టాక్ వస్తుంది… కానీ రిజల్ట్ మాత్రం బొక్కబోర్లా పడుతుంది అని మరికొంతమంది సెటైర్స్ వేస్తున్నారు.ఇక “టైటిల్ వెరైటీగా ఉంది… కథ కూడా వెరైటీగా ఉందా ..లేక అదే పాత చింతకాయ పచ్చడా అంటూ ఆడుకుంటున్నారు యాంటి ఫ్యాన్స్.
చూడాలి మరి రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ ‘కొరియన్ కనకరాజు’ఈ మెగా ప్రిన్స్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో..ఫలితం ఆగస్టు 7న తేలిపోనుంది.!