E-Paper
Advertisement

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !
Advertisement

The Paradise: న్యాచురల్ స్టార్ నాని.పక్కింటి కుర్రాడిగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ స్టార్ ఇపుడు రూటు మార్చాడు.నేనూ యాక్షన్ హీరో అయిపోతానని బ్లడ్ బాత్ లో మునిగి తేలిపోతున్నాడు.దసరా తో ట్రైలర్ చూపించిన నాని ఇపుడు సినిమా చూపిస్తానంటూ ప్యారడైజ్ తో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఇక ఇదిలా ఉండగా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్నఈ  సినిమా నుండి టీజర్ వదలబోతున్నామంటూ ప్యారడైజ్ మేకర్స్ అనౌన్స్ చేయడంతో తమ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటున్నారు నాని ఫ్యాన్స్.

గత కొన్ని నెలలుగా సినిమా గురించి ఎలాంటి కొత్త అప్డేట్ లేకపోవడంతో డీలా పడిపోయారు నాని అభిమానులు.ఎట్టకేలకి వాళ్ళ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్  వేస్తూ The Paradise Teaser – August 6″అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్ డేట్  ఇచ్చేశాడు.

Advertisement

ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్

దీంతో ఇపుడు  ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలా ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్. “ఇంకా పోస్ట్‌పోన్ చేయొద్దు అన్నా… సినిమా హైప్, ఇంట్రెస్ట్ రెండూ తగ్గిపోతున్నాయి” అంటూ చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ మారడం, షూటింగ్‌పై వస్తున్న గాసిప్స్, మధ్యలో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సినిమా మీద ఉన్న ఆసక్తి కాస్త తగ్గిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు టీజర్ అయినా చెప్పిన రోజే రావాలని వారు మనసులోని మాటల్ని కామెంట్స్ రూపంలో వదులుతున్నారు.

Advertisement

మరోవైపు కొంతమంది మాత్రం తమదైన స్టైల్లో ఫన్నీ కామెంట్స్ వదులుతున్నారు.”అది అన్నా… దించు… తగలబెట్టు!”, “టీజర్‌తో ఒక్కసారి సోషల్ మీడియా మొత్తం షేక్ చేయాలి”,”ఇంకా వెయిట్ చేయించే ఓపిక లేదు”అంటూ తమ జోష్ ని చూపిస్తున్నారు.ఇక వీటికి తోడు మీమ్స్ అదే రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి కూడా. కొందరు అయితే టీజర్ వచ్చాకే అసలు సినిమా స్థాయి ఏంటో తెలుస్తుందని,అప్పటివరకు ఎలాంటి అంచనాలు వేయొద్దని  హెచ్చరించడం గమనార్హం.

also read :మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నాని చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా

ఈ సినిమాపై అంచనాలు ఈ రేంజ్ లో ఉండటానికి కారణం  ఇప్పటివరకు నాని చేసిన సినిమాలకు పూర్తిగా భిన్నంగా, రస్టిక్  మాస్ టోన్‌లో ఈ కథ ఉంటుందన్న టాక్ రావడమే.ఇక పోస్టర్లని చూస్తే కూడా ఇదే విషయం అర్థమవుతుంది.ముఖ్యంగా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటం ప్యారడైజ్ కి పెద్ద ప్లస్.

ఇక దర్శకుడు ఈ సినిమాను విజువల్‌గా కూడా కొత్త స్థాయిలో చూపించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. అందుకే టీజర్ విషయంలో కూడా ఎలాంటి రాజీ పడకుండా ఎక్కువ సమయం తీసుకున్నారని అంటున్నారు. చిన్న వీడియో అయినా థియేటర్లలో, సోషల్ మీడియాలో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతోనే ఈ ఆలస్యం జరిగిందని కొందరు విశ్లేషకుల మాట.

అయితే యాంటి ఫ్యాన్స్ మాత్రం ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారని, ఎక్కువ రోజులు అప్డేట్స్ లేకపోతే హైప్ నిలబెట్టుకోవడం కష్టమని అంటున్నారు. అందుకే టీజర్ విడుదలైన వెంటనే పాటలు, ట్రైలర్, ప్రమోషన్స్ కూడా వరుసగా ప్రారంభిస్తేనే సినిమాకు మరింత బజ్ వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

చూడాలి మరి భారీ అంచనాలని మోస్తున్న ఈ ది ప్యారడైజ్ August 6న ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో !

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర”టేక్డీ గణపతి ఆఫ్ నాగపూర్’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×