Kota Srinivas Rao Demise: 1942 జూలై 10వ తేదీన కోటా శ్రీనివాసరావు జన్మించారు రంగస్థలంలో 20 సంవత్సరాలు కొనసాగిన ఆ తర్వాత తెలుగు సినిమాతో నటుడిగా అవతారమెత్తారు తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషల్లో కూడా కొన్ని చిత్రాలలో నటించారు అలా మొత్తం తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750 కి పైగా చిత్రాలలో నటించి లెజెండ్రీ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు ఇక కోటా శ్రీనివాసరావు చివరిగా హరిహర వీరమల్లు సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించినట్లు సమాచారం ఇక ఈ సినిమా విడుదల అవ్వకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. గతంలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారని ఆ మాట కారణంగానే ఇప్పుడు ఆయన సినిమాలు ఛాన్స్ ఇచ్చారని అయితే అదే ఆయనకు చివరి సినిమా అవుతుందని అనుకోలేదంటూ నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోటా శ్రీనివాసరావు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదే సినిమాతో చిరంజీవి కూడా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. కోట శ్రీనివాసరావు నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పనిచేశారు 1999 నుండి 2004 వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఈ కల రాజకీయంగా కూడా ప్రజలకు సేవ చేసి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు.
నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా..
ఇకపోతే కోటా శ్రీనివాసరావు నటుడు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు గొప్ప సింగర్ కూడా ఆయన కొన్ని చిత్రాలలో తన స్వరాన్ని వినిపించారు. ముఖ్యంగా అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన తొలి చిత్రం సిసింద్రీ. నాగార్జున అమల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ తన అద్భుతమైన నటునతో అబ్బురపరిచారు ఇక ఈ సినిమాలో హలో బాసు అంటే సాగే పాటను సింగర్స్ మనో మురళీధర్ లతో కలిసి కోటా శ్రీనివాసరావు పాడారు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో మందు బాబులం అనే పాట పాడి మరొకసారి క్రేజ్ అందుకున్నారు. సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు..
సింగర్ గానే కాదు అటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కోటా శ్రీనివాసరావు మంచి పేరు సొంతం చేసుకున్నారు భారతీయుడు నరసింహ జెంటిల్మెన్ ప్రేమికుల రోజు ప్రియురాలు పిలిచింది ఒకే ఒక్కడు బాబా మజా శివాజీ చిత్రాలలో నటులు గౌండమని, మణివణ్ణన్ లకు తెలుగు డబ్బింగ్ చెప్పారు.
తొలి శ్వాస విడిచిన కోటా శ్రీనివాసరావు..
గొప్ప బహుమక ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు 83 సంవత్సరాలు వయసులో ఈరోజు (జూలై 13) తెల్లవారుజామున 4:00 గంటలకు తొలి శ్వాస విడిచారు. రెండు గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
also read:Bigg Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో చోరీ.. దొంగతనం విలువ ఎంతంటే?