Hardik Pandya: ప్రతి క్రికెటర్ తన జీవితంలో ఏదో ఒక దశలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటాడు. అటు ఆటలో సరిగా రాణించలేక, ఇటు జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోలేక తీవ్ర ఆటుపోట్లకు గురవుతుంటారు. అలా ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఆ స్థాయికి చేరిన ప్లేయర్లు.. ఈ దశను కూడా సమర్థవంతంగా దాటి విజయం సాధించడం చూస్తూనే ఉన్నాం.
Also Read: Chepauk Stadium: CSK ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. చెన్నై చెపాక్ స్టేడియాన్ని తొలగిస్తున్నారా..?
ఇలా తన జీవితంలో ఎన్నో కష్టాలను చూసి.. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వారిలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఒకరు. ఇతడు గతేడాది ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొన్నాడు.
నటాషా – హార్దిక్ పాండ్యా:
మోడల్, హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2020లో ఈ జంట వివాహం చేసుకుంది. అయితే రెండేళ్లు డేటింగ్ చేసిన తరువాత వీరిద్దరూ.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని అప్పట్లో టాక్. దీనికి కారణం కూడా లేకపోలేదు. హార్దిక్ పాండ్యా – నటాషా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే.. నటాషా తల్లి కాబోతుందనే వార్త బయటకు వచ్చింది.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట తమ దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. హార్దిక్ పాండ్యా – నటాషా మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో కొంతకాలం వీరు విడిగా జీవనం కొనసాగించారు. ఆ తరువాత టి-20 వరల్డ్ కప్ 2024 కి ముందు హార్దిక్ – నటాషా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన 4 ఏళ్ల కుమారుడు ఆగస్త్యను కలిశాడు హార్థిక్ పాండ్యా.
2024 జూలైలో హార్దిక్ నటాషా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ క్రమంలో వీరి కుమారుడు అగస్త్యను తీసుకొని తన స్వదేశమైన సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి మళ్లీ ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన కొడుకును కలుసుకున్నాడు హార్థిక్ పాండ్యా. తన కొడుకు ఆగస్థ్యతో పాటు.. తన సోదరుడు కృనాల్ పాండ్యా కుమారులతోనూ హార్దిక్ పాండ్యా ఎంజాయ్ చేస్తున్నాడు.
Also Read: HCA – SRH: HCA లో వరుస అరెస్టులు…ఐపీఎల్ 2026 నుంచి SRH ఔట్… గందరగోళంలో అభిమానులు?
దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన కుమారుడిని మళ్ళీ కలుసుకున్న క్రమంలో పాండ్యా ఎంతో సంతోషంగా కనిపించాడు. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు సూపర్ అని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం.. హార్దిక్ పాండ్యా మనసు మార్చుకున్నాడని, నటాషా ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూసిన హార్దిక్ పాండ్యా అభిమానులు.. హార్దిక్ పాండ్యా నటాషా ఇంటికి వెళ్లలేదని, అగస్త్య.. హార్థిక్ పాండ్యా ఇంటికి వచ్చాడని చెబుతున్నారు. అలాగే ఇటువంటి రూమర్స్ ని క్రియేట్ చేయవద్దని కోరుతున్నారు.