Kingdom Film: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్డమ్(King Dom) సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సినిమా సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు రావడంతో కింగ్డమ్ చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల ఇప్పటికే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు కూడా చేశారు. ఇకపోతే ఈ సినిమాకు తాజాగా ప్రముఖ రాజకీయ నాయకుడు కేటీఆర్ కుమారుడు(KTR Son) హిమాన్షు(Himanshu) రివ్యూ ఇచ్చారు.
కింగ్డమ్ చాలా నచ్చింది..
ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ కుమారుడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా చూశారు. ప్రస్తుతం థియేటర్ వద్ద హిమాన్షుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూసిన అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా తన సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా హిమాన్షు స్పందిస్తూ..” ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సుదర్శన్ థియేటర్లో తాను కింగ్డమ్ సినిమాను తన స్నేహితులతో కలిసి చూసానని తెలిపారు. థియేటర్లో ఈ సినిమా గూస్ బంప్స్ తెప్పించిందని, విజయ్ దేవరకొండ నటన గురించి చెప్పాల్సిన పనిలేదు అదరగొట్టారు.. ఈ సినిమా చాలా బాగా నచ్చింది” అంటూ హిమాన్షు తన అభిప్రాయాన్ని తెలిపారు.
కింగ్డమ్ తో హిట్ కొట్టిన విజయ్?
ఈ విధంగా హిమాన్షు కింగ్డమ్ సినిమా చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో విజయ్ దేవరకొండ హిమాన్షు ట్వీట్ కు రిప్లై ఇస్తూ.. హిమాన్షు లవ్ యు అంటూ రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక స్పై యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Just watched Kingdom with a couple of friends at RTC X Roads. First time in an electrifying theatre 😁
The energy in the theatre was insane with a huge screen, hyped-up audience, and a vibe that gave goosebumps!
Stellar performance by @TheDeverakonda absolutely loved the film!
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) July 31, 2025
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సూరి అనే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారు అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల ఈయన మాఫియా డాన్ గా మారిపోతారు. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి. చాలా రోజుల తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు కింగ్డమ్ కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పాలి. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రౌడీ హీరో కం బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించగా ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించారు.
Also Read: Aadhi – Chaitanya: ఆది పినిశెట్టి ఒక్క రోజు సీఎం… అదో బుద్ది లేని నిర్ణయం అంటూ ఫైర్