Aadhi – Chaitanya: ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) పరిచయం అవసరం లేని పేరు. తెలుగు తమిళ భాషలలో హీరోగా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే ఈయన హీరోగా తెలుగులో నటించిన సినిమాల కంటే కూడా విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడమే కాకుండా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. సరైనోడు సినిమాలో విలన్ పాత్రతో అదరగొట్టిన ఆది పినిశెట్టి ఇటీవల పలు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తున్నారు. ఇకపోతే త్వరలోనే ఆది పినిశెట్టి “మాయసభ”(Mayasabha) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఒక్కరోజు ముఖ్యమంత్రి..
ఈ వెబ్ సిరీస్ కు దేవా కట్టా దర్శకత్వం వహించగా ఇందులో ఆది పినిశెట్టి, చైతన్య రావు(Chaitanya Rao) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇద్దరు గొప్ప స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనే దాని చుట్టూ తిరిగే కథ ఇది. ఇక ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యాంకర్ ఆది పినిశెట్టిని ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఈ సిరీస్ రాజకీయాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో యాంకర్ ప్రశ్నిస్తూ మీరు ఒకరోజు సీఎం(One Day Cm) అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ప్రశ్న వేశారు.
ఉదయం 4 గంటల వరకు పబ్…
ఈ ప్రశ్నకు ఆది పినిశెట్టి చెప్పిన సమాధానం పెద్ద ఎత్తున విమర్శలకు కారణం అవుతుంది. ఇటీవల పబ్ నిర్వహణ కేవలం 12 గంటల వరకు మాత్రమే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి ఒకరోజు ముఖ్యమంత్రి అయితే మాత్రం పబ్ లు ఉదయం 4:00 వరకు తెరిచి ఉండేలా నిర్ణయం తీసుకుంటాను అంటూ ఈయన తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆది పినిశెట్టి ఇలాంటి సమాధానం చెప్పగా పక్కనే ఉన్నటువంటి చైతన్య రావు కూడా తాను ఒకరోజు ముఖ్యమంత్రి అయితే మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకూడదని చెబుతాను అంటూ ఈ సందర్భంగా ఈ ఇద్దరు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బుద్ధిలేని నిర్ణయం..
ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి అంటే ఆసామాషీ పదవి కాదు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం బుద్ధిలేని నిర్ణయం అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ లు 12 గంటల వరకు తెరిచి ఉంటేనే ఎంతో మంది యువత తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు అలాంటిది నాలుగు గంటల వరకు ఉంచితే యువతను పూర్తిగా చెడగొట్టినట్లేనని ఈ హీరోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే మాయ సభ సిరీస్ విషయానికి వస్తే ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ ఈ సిరీస్ పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సిరీస్ ఆగస్టు 7 సోనీ లీవ్ లో విడుదల కానుంది.
Also Read: King dom – HHVM: ‘కింగ్‌డమ్’కు ఇండస్ట్రీ మద్దతు.. వీరమల్లు విషయంలో ఎందుకు మౌనం?