BigTV English

Naga vamsi: కొందరు కావాలనే నెగిటివ్ రాస్తున్నారు, మరోసారి కౌంటర్ ఇచ్చిన నాగ వంశీ

Naga vamsi: కొందరు కావాలనే నెగిటివ్ రాస్తున్నారు, మరోసారి కౌంటర్ ఇచ్చిన నాగ వంశీ

Naga vamsi: గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఏ ముహూర్తాను మొదలుపెట్టారో అప్పటినుంచి ఈ సినిమా మీద హైప్ పెంచుతూనే ఉన్నాడు నిర్మాత నాగ వంశీ. కొన్ని సినిమాలకు నాగ వంశీ ఎలివేషన్ ఇవ్వడం మామూలు విషయమే, కానీ ఈ సినిమాకు ఇచ్చిన ఎలివేషన్ మాత్రం వాటన్నిటికీ అతీతం.


ఈ సినిమా రెండు పార్టులులో ఉండబోతుందని, ఈ సినిమా కథను మొదలుపెట్టినప్పుడే చెప్పారు. అలానే కింగ్డమ్ సినిమాకు సంబంధించి ప్రాపర్ స్టార్టింగ్ మరియు ఎండింగ్ ఉంటుంది అని కూడా తెలిపారు. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

కావాలనే నెగిటివ్ రాస్తున్నారు


నాగ వంశీ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అతనిని చూస్తున్నాం. సినిమా సక్సెస్ మీట్ లో పలు రకాల విషయాలు పంచుకున్నాడు వంశీ. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అంతా గమనించాను. చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ప్రతి సినిమాకి కామన్ గానే ఉంటాయి. మాకు కూడా ఆ మిస్టేక్స్ అర్థమయ్యాయి. కొందరు కావాలని సినిమా గురించి నెగిటివ్ గా రాస్తున్నారు. వాళ్లెవరో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటూ మీడియా ఉద్దేశించారు. ఈ సినిమా 2025లోనే హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ తెరకెక్కించమంటూ మాట్లాడారు నాగ వంశీ. ఏమీ ఆలోచించకుండా సినిమాకు వెళ్ళండి.

ఆల్మోస్ట్ కలెక్షన్స్ వచ్చేసినట్లే 

నాగ వంశీ మాట్లాడుతూ యుఎస్ లో ఎంత రేటుకు అమ్మామో సగం ఫస్ట్ డే వచ్చేసాయి. ఇక హైయెస్ట్ కలెక్షన్స్ రాయలసీమలో వచ్చాయి. తెలంగాణ హీరో అని మాట్లాడుతారు. కానీ ఎక్కువ కలెక్షన్స్ రాయలసీమలో రావడం అనేది ఆశ్చర్యం. ఆంధ్రాలో జిల్లాకు ఎంత వచ్చింది అని చెప్పలేను. కానీ ఆల్మోస్ట్ సగం డబ్బులు వచ్చేసాయి. నైజాంలో దాదాపు 7 కోట్ల వరకు వచ్చాయి. నాకు వినిపిస్తున్న ట్రేడ్స్ ప్రకారం నేనువి చెప్తున్నాను. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది అంటూ నాగ వంశీ తెలిపారు.

Also Read: Vijay Devarakonda: ఈ రోజు నన్ను చాలామంది ఏడిపించారు, ఎమోషనల్ అయిపోయిన విజయ్ దేవరకొండ

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×