BigTV English
Advertisement

Kuberaa: దారుణంగా పడిపోయిన ‘కుబేర’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?

Kuberaa: దారుణంగా పడిపోయిన ‘కుబేర’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కష్టమేనా..?

Kuberaa: టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రేక్షకుల మనసును హత్తుకునే కథలతో పాటుగా చక్కని మెసేజ్ ను తన సినిమాల ద్వారా అందిస్తాడు. ఈ మధ్య ఈయన తెరకెక్కించిన సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. తాజాగా కుబేర చిత్రంతో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తమిళ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే కలెక్షన్స్ మాత్రం డౌన్ అయ్యాయనె టాక్ వినిపిస్తుంది. మరి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..


ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

కుబేర వారం కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి వారం ముగించేసరికి రూ.58.99 కోట్ల షేర్, రూ.100.6 కోట్ల గ్రాస్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.1.01 కోట్ల షేర్‌ అవసరం. ఏ సెంటర్లలో బాగానే రన్ అవుతున్నా, బీ, సీ సెంటర్లలో కలెక్షన్స్ పడిపోవడం మైనస్ అయ్యింది. ఇప్పుడు కన్నప్ప ఎఫెక్ట్ కుబేర పై పడింది. ఇక కుబేర కలెక్షన్స్ మరీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా, రెండో వారంలో ‘కుబేర’ లాభాల్లోకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం రూ.60 కోట్లు రాబట్టాల్సి ఉంది. అంతే మ్యాజిక్ ఫిగర్‌కి ఇంకా రూ.1.01 కోట్ల దూరంలో నిలిచింది. సెకండ్ వీక్‌లో ఈ మూవీ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లడం ఖాయమే అని టాక్ నడుస్తుంది. మరి చూడాలి ఎంత వసూల్ చేస్తుందో..


Also Read : అంత లేపారు… మరి కలెక్షన్స్ ఏంటి మరీ ఇంత తక్కువ ?

మూవీ బిజినెస్ విషయానికొస్తే..

తమిళ హీరో ధనుష్, నాగ్ కాంబోలో ఇలాంటి స్టోరీతో మూవీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే శేఖర్ కమ్ముల గుండెలను హత్తుకునే స్టోరీని ప్రేక్షకులను అందించారు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత టాక్ పూర్తిగా మారిపోయింది. పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకుపోతుంది. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ.59 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలి మూడు రోజుల్లో రూ.43 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది. వీకెండ్‌ని బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’ మండే నుంచి స్లో అయింది. రోజు రోజుకు కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలు. ప్రస్తుతం థియేటర్లలోకి కన్నప్ప మూవీ వచ్చింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ ఎఫెక్ట్ ‘కుబేర’పై బాగానే పడటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘కుబేర’ కంటెంట్ బాగానే ఉన్నా అది బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకి అంతగా అర్థం కానట్లుగా అనిపించింది.. మరి కుబేర కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.

Related News

Venky Trivikram : సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే, వెంకటేష్ తో శ్రీనిధి కీలక సీన్స్

Rahul Ravindran: అత్తారింటికి దారేది సినిమా రిజెక్ట్ చేశాను, అంత ఇంపార్టెంట్ పాత్ర ఏంటి?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి 

Suriya: మరో తెలుగు డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూర్య, ప్రొడ్యూసర్ గా దిల్ రాజు

SYG : సంబరాల ఏటిగట్టు సినిమా కాన్సెప్ట్ ఇదే, తమిళ్ దర్శకుల నుంచి ఇన్స్పైర్ అయ్యారా?

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్

MassJathara vs Bahubali The Epic: మాస్ జాతర vs బాహుబలి ది ఎపిక్.. బాక్సాఫీస్ విజేత ఎవరు?

Big Stories

×