OTT Movie : ఓటీటీలో ఒక టైమ్ ట్రావెల్ మూవీ మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా హారర్, కామెడీ, టైమ్ ట్రావెల్ థీమ్‌లతో తెరకెక్కింది. తన తల్లిని చంపిన కిల్లర్ ని చంపడానికి ఒక అమ్మాయి 30 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఆ తరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో
ఈ అమెరికన్ స్లాషర్ కామెడీ మూవీ పేరు ‘టోటలీ కిల్లర్’ (Totally Killer). 2023లో విడుదలైన ఈ సినిమాకి నహనాచ్కా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్నన్ షిప్కా, ఒలివియా హోల్ట్, జూలీ బోవెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో 2023 అక్టోబర్ 6 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. 1 గంట 46 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
వెర్నాన్ అనే చిన్న పట్టణంలో 1987లో స్వీట్ 16 కిల్లర్ టిఫనీ, మారిసా, హీథర్ అనే ముగ్గురు యువతులను వాళ్ళ 16వ పుట్టినరోజున 16 సార్లు గుండెలో పొడిచి చంపుతాడు. ఈ కిల్లర్‌ను ఇంతవరకూ ఎవరూ పట్టుకోలేకపోయారు. ఇక స్టోరీ 35 సంవత్సరాల తర్వాత ప్రెజెంట్ లోకి వస్తుంది. ఈ కిల్లర్ మళ్లీ కనిపించి, జామీ హ్యూస్ తల్లి పామ్ ను చంపేస్తాడు. పామ్ 1987లో చనిపోయిన ఆ ముగ్గురు అమ్మాయిలకు స్నేహితురాలిగా ఉండేది. ఈ సంఘటన జరిగిన తరువాత, జామీ తన స్నేహితురాలు అమీలియా రూపొందించిన టైమ్ మిషన్‌లో అనుకోకుండా 1987లోకి టైమ్ ట్రావెల్ చేస్తుంది. అక్కడ ఆమె టీనేజ్ లో ఉన్నతన తల్లి పామ్ తో కలిసి, స్వీట్ 16 కిల్లర్‌ను మొదటి సారి హత్యలు జరగకముందే ఆపడానికి ప్రయత్నిస్తుంది.
1987లోని స్కూల్ జీవితం, ఆనాటి టీనేజ్ సంస్కృతి, పామ్‌తో స్నేహం చేయడం జామీకి ఒక సవాలుగా మారుతుంది. జామీ, అమీలియా తల్లి లారెన్ సహాయంతో కిల్లర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అక్కడ ఆమె చేసే పనులవల్ల టైమ్‌లైన్‌ను మారిపోతుంది. ఇక్కడ కొత్త హత్యలు జరుగుతాయి. చివరికి హాలోవీన్ రాత్రి అమ్యూస్‌మెంట్ పార్క్‌లో జరిగే హత్యలకు కారణం ఎవరో జామీ గుర్తిస్తుంది. అతను తన స్నేహితురాలి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి హత్యలు చేసి ఉంటాడు. చివరికి జామీ తన తల్లిని కాపాడుకుంటుందా ? ఆ కిల్లర్ ని ఎలా ఎడదుర్కుంటుంది ? టైమ్ లైన్ నుంచి మళ్ళీ బయటికి వస్తుందా ? అనే ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అనుమానంతో భార్య మర్డర్ కు మాస్టర్ ప్లాన్… ఆ ఒక్క పొరపాటుతో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్