Yadadri Crime: తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదని ఈ మధ్యకాలంలో యువతీ-యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. కలిసి జీవితం పంచుకోవాల్సివారు అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా యాదాద్రి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. రిసార్టులో అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ఆ ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకి చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఏం తేలింది. ఇప్పుడు చూద్దాం.
పోలీసుల కథనం మేరకు.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రామంతాపూర్‌లోని కేసీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు 39 ఏళ్ల సుధాకర్. అదే ఏరియాలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటోంది సుష్మిత. ఆమె వయస్సు 35 ఏళ్లు. అయితే సుధాకర్-సుష్మిత సమీప బంధువులు. వరసకు బావ, మరదలు అవుతారు. అయితే వీరికి పెళ్లిళ్లు అయ్యాయి. వేర్వేరుగా ఉంటున్నారు.
దగ్గరి బంధువులు సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అది వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టాడు. దీన్ని అవమానంగా భావించింది సుష్మిత.
ALSO READ: ఇద్దరి అస్థిపంజరాలతో స్టేషన్‌కు.. లివింగ్ టు గెదర్ వెనుక
ఈ విషయమై సుధాకర్-సుష్మితలు చర్చించుకున్నారు. రెండు రోజుల కిందట బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌లో రూమ్ తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సుధాకర్ తన బావ రంజిత్‌కు ఫోన్ చేశాడు. వెంటనే రంజిత్ ఉప్పల్ పోలీసుల సాయంతో బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఆదివారం సాయంత్రం కొండమడుగు శివారులోని రిసార్ట్స్‌కు చేరుకున్నారు. వారున్న రూమ్ తలుపులు పగలకొట్టి చూసే సరికి ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. శవ పరీక్ష నిమిత్తం మృత దేహాలను భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు ప్రస్తుతం రామంతాపూర్‌లో నివాసం ఉంటున్నాయి. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.