Anchor Swetcha Purnachandar: మళ్లీ స్వేచ్ఛా ఆత్మ హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. చిక్కడపల్లి పోలీసులు పూర్ణ చంద్‌ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అతని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటా నమ్మించి, తర్వాత మొదటి భర్తకు విడాకులు ఇస్తే పెళ్ళి చేసుకుందాం అని మాయ మాటలు చెప్పి స్వేచ్ఛను నమ్మించినట్లు తెలిపారు. అయితే విడాకులు ఇచ్చిన అనంతరం కూడా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన ప్రతి సారి గొడవలు జరిగేవి అని చెబుతున్నారు. మరో విషయం తనకు రాజకీయ సపోర్ట్ ఉందని నన్నేం చేయలేవని స్వేచ్ఛను బెదిరించేవాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్‌ఎస్‌కు సంబంధించన నేత జోగినిపల్లి సంతోష్‌రావు తన వెనుక ఉన్నాడు, నేను తన వద్దే ఉంటానని కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.
సోషల్ మీడియాలో ఫోటోస్:
అయితే వారం రోజుల క్రితం పూర్ణ చందర్, స్వేచ్ఛ ఇద్దరు కలిసి అరణాచలం ట్రిప్ వెళ్ళారు. కొన్ని పుణ్య క్షేత్రాల దర్శించుకున్న అనంతరం వారు 3 రోజుల క్రితం హైదరాబాద్ తిరిగి వచ్చారు. అయితే ఈ ట్రిప్ ముగిసిన అనంతరం స్వేచ్ఛ తన ఇన్‌స్టా అకౌంట్లో వారి ఇద్దరికి సంబంధించనటువంటి ఫోటోలను షేర్ చేసింది. సోషల్ మీడియాలో కూడా పూర్ణచందర్, స్వేచ్ఛగా పేరుంది. గతంలో తన భర్తకు విడాకుల ఇచ్చిన తర్వాత పూర్తిగా పూర్ణనే తన భర్త అని నమ్మింది. కానీ పెళ్లి ప్రస్తావన అడిగినప్పుడల్లా దాటవేస్తూ ఉండేవాడు. అయితే అరుణాచలం వెళ్లి వచ్చిన తర్వాత కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం దాంతో మళ్లి గోడవలు పడటం.. ఈ సారి గొడవ పెద్దగా జరిగినట్టు తెలుస్తుంది.
జోగినిపల్లి సంతోష్‌రావు, మరి కొంత మంది అండదండలు నాకు ఉన్నాయి. నన్ను నువ్వు ఏం చేయలేవు.. నిన్ను పెళ్లి చేసుకోనని పూర్ణ చేందర్ గట్టిగా చేప్పడంతో తీవ్ర మానస్థాపనికి స్వేచ్ఛ గురై ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చిక్కడిపల్లి పోలీసులు BNS 69, BNS 108 సెక్షన్ల తో పాటు పోక్సో కేసు నమోదు చేశారు.
పూర్ణ చందర్ భార్య ట్విస్ట్:
ప్రస్తుతం ఇప్పుడు స్వేచ్ఛ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పూర్ణచందర్ భార్య స్వప్న మీడియాముందుకు వచ్చింది.
స్వేచ్ఛపై సంచలన ఆరోపణలు చేస్తూ స్వప్న వీడియో రిలీజ్ చేసింది. పూర్ణను, తనను స్వేచ్ఛ ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదని తెలిపింది స్వప్న. నిద్రమాత్రలు మింగి బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. స్వేచ్ఛ తనను టార్చర్ చేయడంతో డ్రిపెషన్‌లోకి వెళ్లానని.. అప్పుడు పూర్ణ కాశీకి తీసుకెళ్లాడంది. అలా ఎలా తీసుకెళ్తావని పూర్ణను స్వేచ్ఛ బెదిరించిందని స్వప్న తెలిపింది.
Also Read: భారత దేశం అంటేనే లౌకిక దేశం.. ఆ పేరు తీసెయ్యాలన్నడిమాండ్లు
అటు స్వేచ్ఛ కుమార్తె ఆరోపణలను స్వప్న ఖండించింది. తన పిల్లలతో పాటే స్వేచ్ఛ కుమార్తెను పూర్ణ చూసుకున్నాడని తెలిపింది. స్కూల్ ఫీజులు కట్టాడు, డ్రెస్సులు తీసుకున్నాడని.. ఇంతా చేస్తే తమ బతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. స్వేచ్ఛ కుమార్తె ఆరోపణల వెనక ఎవరు ఉన్నారు? తేలాల్సి ఉందన్నారు.
అంతేకాకుండా మా ఆయన నాకు నమ్మకం ఉంది, ఆయన చెడ్డవాడు కాదని స్వప్న తెలిపారు. స్వేచ్ఛను ఇంతలా చేరదీసినప్పటికీ మా బతుకులను రోడ్డు పాలు చేసిందని అన్నారు. అయితే స్వేచ్ఛ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేయడంతో నాకు మా వారికి గొడవలు మొదలయ్యాయని తెలిపింది. అదే టైంలో పూర్ణకు స్వేచ్ఛతో కూడా గొడవలు ఉన్నాయి. దీంతో ఆయనకు ఒత్తిడి చేయకూడదని వదిలేశాను అని పూర్ణ భార్య స్వప్న పేర్కొన్నారు.
స్వేచ్చ ఆత్మహత్య కేసులో మరో మలుపు
మీడియాకు వీడియో విడుదల చేసిన పూర్ణచందర్ భార్య స్వప్న
స్వేచ్చ కూతురు మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను
ఆమెను పూర్ణచందర్ సొంత బిడ్డలా చూసుకున్నారు
స్వేచ్చ నన్ను కూడా చాలా టార్చర్ పెట్టింది
నాకు, మా ఆయనకు పదే పదే… pic.twitter.com/AQHoiFlhZx
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025