BigTV English

Disco Shanti: భర్త చనిపోయిన మెడలో తాళితో నటి.. ఈమె ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

Disco Shanti: భర్త చనిపోయిన మెడలో తాళితో నటి.. ఈమె ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

Disco Shanti: ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు అయిన మెడలో తాళి లేకుండా కాలికి మెట్టెలు లేకుండా కనిపిస్తూ ఉన్నారు. ఇక భర్త చనిపోయిన వారి గురించి చెప్పాల్సిన పనిలేదు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం భర్త చనిపోయిన తర్వాత మెడలో మాంగళ్యం తీసేయడం ఒక ఆనవాయితీ. అయితే ఒక నటి మాత్రం తన భర్త చనిపోయి దాదాపు దశాబ్ద కాలం అవుతున్న ఇప్పటికీ మెడలో తాళితో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మరి భర్త చనిపోయిన మెడలో తాళితో కనిపించిన ఆ నటి ఎవరు? ఎందుకు ఆమె మెడలో ఇప్పటికి తాళి ఉంది? భర్త చనిపోయిన తర్వాత రెండవ పెళ్లి ఏమైనా చేసుకుందా? అనే విషయానికి వస్తే…


అనారోగ్యంతో మరణం..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దివంగత నటుడు శ్రీహరి (Sri Hari)ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనారోగ్య సమస్యల కారణంగా శ్రీహరి 2013 అక్టోబర్ 9వ తేదీ మరణించారు. ఇక ఈయన భార్య డిస్కో శాంతి(Disco Shanti) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరిది ప్రేమ వివాహం వీరికి ఇద్దరు అబ్బాయిల సంతానం అనే సంగతి తెలిసిందే. ఇక డిస్కో శాంతి కూడా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.


మెడలో మంగళసూత్రం..

శ్రీహరిని వివాహం చేసుకున్న తర్వాత డిస్కో శాంతి కూడా సినిమాలను పూర్తిగా తగ్గిస్తూ వచ్చారు. ఇక తన భర్త శ్రీహరి మరణించడంతో ఈమె మీడియాకి కూడా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తన భర్త మరణం తర్వాత ఎవరిని ఎలాంటి సహాయాలు అడగకుండా తన స్వశక్తితో బ్రతుకుతూ తన పిల్లల బాగోగులు కూడా చూసుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి మెడలో మంగళసూత్రాలతో(mangalsutra) కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. తన భర్త చనిపోయిన ఈమె మంగళసూత్రం వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

శ్రీహరి ప్రేమకు గుర్తుగా…

ఇకపోతే డిస్కో శాంతి శ్రీహరిని ముద్దుగా బావ అంటూ పిలుచుకుంటారు. తన బావ శ్రీహరి మరణించిన తర్వాత చాలామంది ఆయన మెడలో కట్టిన తాళి తీసేయమని చెప్పారు కానీ నేను ఎవరి మాట వినలేదు. అది నా బావ తన ప్రేమకు గుర్తుగా నాకు కట్టింది. ఆయన ప్రస్తుతం నా ముందు లేకపోయినా, అతను కట్టిన తాళి నా మెడలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మంగళసూత్రం అలాగే వేసుకున్నానని తెలిపారు. అంతేకాకుండా శ్రీహరి తన మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్ వేసుకుంటారు దానిని కూడా ఈమె తన మంగళ సూత్రంలోనే వేసుకోవడ విశేషం. ఈ తాళిబొట్టును మా బావ ప్రేమకు గుర్తుగా ఉన్నించుకున్నానని ఎవరైనా దీనిపైన చేయి వేస్తే చంపేస్తానని తెలిపారు. అయితే ఇది మెడలో ఉంది కదా అని నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకుంటే మనతో మామూలుగా ఉండదు అంటూ ఓ రకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారడంతో డిస్కో శాంతి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. భర్త ఉన్నప్పటికీ ఎంతో మంది తాళిబొట్టు తీసేసి తిరుగుతున్నారు మీరు మాత్రం ఆయన గుర్తుగా తాళిబొట్టు అలాగే పెట్టుకోవడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read: ఇండస్ట్రీ వరెస్ట్ స్టేజ్‌లోకి వెళ్తుంది… మూసుకోవాల్సిందే అంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్

Related News

NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Kangana Ranaut: క్యాస్టింగ్ కౌచ్ పై కంగనా కామెంట్స్.. అలా చేస్తేనే అవకాశం!

Betting Apps case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న హీరో రానా..

War 2 Event : ‘వార్ 2’ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..?

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

Big Stories

×