BigTV English

Railway Track Safety: ఇదేం టెక్నాలజీ బాబోయ్! రైల్వే పట్టాలకు గ్యాప్ ఉందా? ఇట్టే చెప్పేస్తుంది!

Railway Track Safety: ఇదేం టెక్నాలజీ బాబోయ్! రైల్వే పట్టాలకు గ్యాప్ ఉందా? ఇట్టే చెప్పేస్తుంది!

Railway Track Safety: రోజూ వేల కిలోమీటర్ల ట్రాక్‌లపై ప్రయాణించే రైళ్లు మనకు సురక్షితంగా లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ, ఆ ట్రాక్‌లు ఎలా అంత భద్రంగా ఉంటున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఓ చిన్న లోపం, ఒక చిన్న చీలికే పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు.. వాటిని ముందే కనిపెట్టడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే ఇండియన్ రైల్వే సరికొత్త టెక్నాలజీని కనుగొంది. ఆ టెక్నాలజీ ఏమిటి? మన ప్రయాణం ఏ మేరకు సేఫ్ అనే విషయాలు తెలుసుకుందాం.


ప్రస్తుత వేగవంతమైన రైల్వే వ్యవస్థలో ఒక్క చిన్న లోపమే పెద్ద ప్రాణ నష్టం కలిగించే ప్రమాదాన్ని తెచ్చే అవకాశముంటుంది. అందుకే భారతీయ రైల్వేలు భద్రతను అత్యధిక ప్రాధాన్యతగా తీసుకుని, సాంకేతికంగా ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే డివిజన్ ఈ దిశగా ఓ కీలక ముందడుగు వేసింది.

ఆగ్రా డివిజన్‌లో మొత్తం 1,300 కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్‌లను ప్రత్యేకమైన యంత్రాలతో తనిఖీ చేస్తున్నారు. ఈ యంత్రాలు మన కళ్లకు కనిపించని లోపాలను గుర్తించగలవు. మనం బయట చూడలేని లోపాలు, చీలికలు ఉండవచ్చు. ఇవి రైలు నడుస్తున్నప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టేస్తాయి. అలాంటి వాటిని ముందుగానే కనిపెట్టి చర్యలు తీసుకోవాలంటే ఆధునిక సాంకేతికత తప్పనిసరి. అందుకే ఇప్పుడిదే ఆ పరికరాలు పనిచేస్తున్న విధానంను ఇండియన్ రైల్వే తీసుకువచ్చింది.


అల్ట్రాసోనిక్ ఫ్లో డిటెక్షన్ యంత్రం అంటే ఏమిటి?
ఇది ప్రత్యేకంగా తయారుచేసిన ఒక రకమైన సాంకేతిక పరికరం. ఇది అల్ట్రాసోనిక్ తరంగాలు అనే శబ్ద తరంగాలను రైల్వే ట్రాక్‌లోకి పంపుతుంది. ట్రాక్‌లో ఎక్కడైనా లోపం, గ్యాప్, క్రాక్ ఉంటే, ఈ తరంగాలు అక్కడ నుండి తిరిగి వస్తాయి. ఆ తిరిగి వచ్చిన శబ్ద తరంగాలను విశ్లేషించి, ఎక్కడ లోపం ఉందో ఖచ్చితంగా గుర్తించగలుగుతుంది. ఇది ఒక స్కానర్ లాంటిది అనుకుంటే కరెక్ట్. కానీ ఇది మనకంటికి కనిపించని లోపాలను కూడా చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. రైలు ప్రయాణించే రహదారిని ఎక్స్‌రే చేయడం లాంటిది!

ఈ యంత్రాలు ఉపయోగించే విధానం
రైలు ట్రాక్‌పై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టెస్టింగ్ వాహనాలు ఈ యంత్రాలతో కలిసి పనిచేస్తాయి. అవి క్రమం తప్పకుండా ట్రాక్‌లను స్కాన్ చేస్తూ, ఏదైనా లోపం ఉన్న చోట అలర్ట్ ఇస్తాయి. అదే సమయంలో డేటా కూడా రికార్డ్ చేసి, సంబంధిత శాఖలకు పంపుతుంది. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపడతారు.

ప్రయోజనాలు
ప్రమాదాలను ముందే నివారించగలగడం ద్వారా చీరిన ట్రాక్‌ ద్వారా ప్రమాదం వచ్చే అవకాశం ఉండదు. పెద్ద ప్రమాదం వచ్చిన తర్వాత చేయాల్సిన ఖర్చును మినహాయిస్తుంది. ప్రయాణికుల నమ్మకాన్ని పెంచుతుంది. సురక్షితమైన ప్రయాణానికి ఇది ముఖ్యమైన అంశం. మానవుల కంటే వేగంగా, ఖచ్చితంగా లోపాలను గుర్తిస్తుంది.

Also Read: Secunderabad to Shirdi Express: డైరెక్ట్ రైలు షిరిడీకే.. హైదరాబాద్ భక్తులకు గుడ్ న్యూస్

ఇండియన్ రైల్వేలో సాంకేతికత వాడకంపై దృష్టి
ఇప్పటి వరకూ మన దేశంలో రైల్వే ట్రాక్‌ల తనిఖీ ఎక్కువగా మానవ శ్రమ ఆధారంగానే జరిగింది. అయితే, ప్రమాదాల పెరుగుదల, ట్రాఫిక్ భారంతో ఆధునిక పద్ధతులు అవసరమయ్యాయి. అల్ట్రాసోనిక్ ఫ్లో డిటెక్షన్ లాంటి పరికరాలు ఇప్పటికే అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లో విస్తృతంగా వాడుతున్నారు. ఇప్పుడు భారత రైల్వేలు కూడా ఈ సాంకేతిక మార్గాన్ని అనుసరిస్తున్నాయి.

భవిష్యత్‌లో మరింత విస్తరణ
ఆగ్రా డివిజన్ ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో, దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న దిశగా రైల్వే శాఖ ఆలోచిస్తోంది. హై స్పీడ్ ట్రైన్ల, ఫ్రైట్ కార్గో రూట్లలో ఇది తప్పనిసరి మారుతుంది. ప్రతిరోజూ కోట్లాది మందిని ప్రయాణింపజేస్తున్న రైల్వేలు ఈ రకమైన భద్రతా పద్ధతుల ద్వారా మరింత విశ్వసనీయతను అందించనున్నాయి.

ఈ రకమైన టెక్నాలజీలు మనకు కనిపించవు. కానీ మన ప్రయాణం సురక్షితంగా జరగడం వెనుక ఇవి కీలకంగా ఉంటాయి. రైలు ఎప్పుడూ సమయానికి వస్తోంది, వేగంగా నడుస్తోంది అంటే.. అందులో ఇలాంటి శ్రద్ధ, శాస్త్రీయ తనిఖీలే కారణం. రైల్వేలు ఈ విధంగా ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు చేస్తున్న కృషిని మనం గుర్తించాలి.

ఒక చిన్న చీలిక రైలును పట్టాలు తప్పించగలదు. కానీ అలాంటి లోపాలను ముందే కనిపెట్టి, రక్షించగల సాంకేతికత మన దేశంలో ఉపయోగంలోకి రావడం నిజంగా అభినందనీయం. ఇది కేవలం రైల్వే భద్రత కోసం కాదు.. ప్రతి ప్రయాణికుడి ప్రాణం కోసం. రైల్వేలు తీసుకుంటున్న ఈ ముందుగానే స్పందించే చర్యలు దేశం భద్రతను ప్రతిబింబిస్తున్నాయి.

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×