E-Paper
Advertisement

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

మహీంద్రా నుంచి ఒకేసారి 3 కొత్త SUVలు.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?
Advertisement

Mahindra Upcoming SUVs in 2027: భారత కార్ల మార్కెట్లో కొత్త మోడళ్లతో సందడి చేసేందుకు మహీంద్రా రెడీ అవుతోంది. 2027 మొదటి ఆరు నెలల్లో ఐదు కీలక లాంచ్‌లు చేపట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో మూడు కొత్త మోడళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్, విజన్ S కాన్సెప్ట్ ఆధారిత SUV, BE 07 ఎలక్ట్రిక్ SUV వీటిలో ఉన్నాయి. వీటితో పాటు మరో కొత్త లైట్ కమర్షియల్ వెహికల్, ప్రస్తుతం అమ్ముతున్న ఓ మోడల్‌కు అప్‌డేట్ తీసుకురానుంది.

ఏప్రిల్‌ లో స్కార్పియో లైఫ్‌ స్టైలర్ పికప్

మహీంద్రా తీసుకొస్తున్న కొత్త మోడళ్లలో స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకమైనది. 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని డెవలప్ చేశారు. 2026 ఆగస్టులో ఆవిష్కరించిన ఈ పికప్ ట్రక్, స్కార్పియో N SUV ఉపయోగించే బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పైనే రూపొందింది. 2027 ఏప్రిల్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర రూ.19.79 లక్షల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. స్కార్పియో Nలో ఉపయోగించిన  175hp 2.2 లీటర్ డీజిల్, 203hp సామర్థ్యం కలిగిన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఇందులో ఉండవచ్చు. 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ లతో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా రావచ్చు. టయోటా హైలక్స్, ఇసుజు D-Max V-Cross వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

మహీంద్రా BE 07 ఎలక్ట్రిక్ SUV

Advertisement

మహీంద్రా తీసుకొస్తున్న మరో కీలక మోడల్ BE 07 ఎలక్ట్రిక్ SUV. BE సిరీస్‌లో BE 6 తర్వాత వచ్చే మరో ముఖ్యమైన మోడల్‌గా నిలవనుంది. 2027 జూన్ నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ SUVలో మూడు స్క్రీన్లతో కూడిన డ్యాష్‌బోర్డ్, గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, డ్యాష్‌క్యామ్, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఐదుగురు ప్రయాణించేలా రూపొందించనున్నారు. INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే ఈ SUVలో BE 6 మాదిరిగా 59kWh, 79kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని అంచనా. టాటా హారియర్ EV, BYD అట్టో 3 లాంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

విజన్ S ఆధారంగా కొత్త కాంపాక్ట్ SUV

మహీంద్రా విజన్ S కాన్సెప్ట్ ఆధారంగా మరో కొత్త SUVని తీసుకురానుంది. 2025 ఆగస్టులో ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్ 2027 జూన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కంపెనీ కొత్త NU_IQ ప్లాట్‌ఫామ్‌పై రూపొందనున్న తొలి మోడల్ కానుంది. నాలుగు మీటర్లలోపు పొడవుతో రానున్న ఈ SUVలో బాక్సీ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వెనుకవైపు టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్ లాంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు ఈ ప్లాట్‌ఫామ్ సపోర్టు ఇస్తుంది.

Advertisement

Read Also: మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

Tags

Related News

మారుతి కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.36 లక్షల తగ్గింపు!

బజాజ్ చేతక్ సంచలనం.. 10 లక్షలు దాటిన అమ్మకాలు!

సన్ షీల్డ్, పిన్‌లాక్ లెన్స్‌ తో కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్.. ధర ఎంత అంటే?

ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది.. కొత్త ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

విన్‌ఫాస్ట్ MPV 7 ధర భారీగా తగ్గింపు.. ఏకంగా రూ.4.10 లక్షలు కట్..

కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ ఎడిషన్ వన్.. లుక్ అదిరింది గురూ!

జీప్ ఎస్‌యూవీలపై దీపావళి ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.65 లక్షల డిస్కౌంట్!

Big Stories

Advertisement
×