HHVM Screening Halted: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా జులై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే ఉందని చెప్పాలి.. ఇక మొదటి రోజు నుంచి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.
అత్యుత్సాహాం కనబరిచిన ప్రేక్షకులు..
ఇకపోతే తాజాగా లండన్(Landon) లో వీరమల్లు సినిమాకు ఊహించని షాక్ తగిలింది. అక్కడ థియేటర్ యాజమాన్యం ఈ సినిమా స్క్రీనింగ్ క్లోజ్ చేయటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన ఇండియాలో ఉన్న విధంగా కాకుండా విదేశాలలో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇలా రూల్స్ బ్రేక్ చేస్తే కనుక కఠినమైన చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా విడుదల అయిన నేపథ్యంలో లండన్ లో తెలుగువారు ఈ సినిమాపై అత్యుత్సాహం కనబరిచారు.
లండన్ లో స్క్రీనింగ్ నిలిపివేత…
జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను లండన్ లో ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శితం చేశారు. అయితే ఈ సినిమా చూడటం కోసం వచ్చిన తెలుగువారు పెద్ద ఎత్తున థియేటర్లలో రంగు కాగితాలను చల్లుతూ పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే విదేశాలలో ఉన్న ఈ థియేటర్లలో ఇలా కాగితాలు చల్లాలి అంటే ముందుగా థియేటర్ యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కానీ ఈ థియేటర్లో అభిమానులు మాత్రం అందుకు అనుమతి తీసుకొని నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం స్క్రీనింగ్ నిలిపివేసి ప్రేక్షకులను బయటకు పంపించారు.
?igsh=MW1kaDBkbHIyeGZpMw%3D%3D
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ ఇది ఇండియా కాదు ఇక్కడ ఏ పని చేయాలని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు. ఇలా ఈ వీడియో సోషల్ మీడియా మారడంతో ఎక్కడో లండన్ వెళ్లి మన తెలుగువారి పరువును గంగలో కలిపారు కదరా అంటూ ఈ వీడియో పై పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు చేయగా మరికొందరు థియేటర్ రూల్స్ కాస్త పట్టించుకోవాలి కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హిస్టారికల్ పిరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ ఎమ్ రత్నం నిర్మాణంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించారు.
Also Read: HBD Akaash Puri: చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా.. సక్సెస్ రుచి ఎరుగని స్టార్ తనయుడు!