సాధారణంగా ఈ రోజుల్లో ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్ లో పెడతారు. కానీ, కొన్ని దేశాల ప్రజలు పాలు చెడిపోకుండా ఉండేందుకు ఎవరూ ఊహించని చిట్కా పాటిస్తారట. అవును.. రష్యా, ఫిన్లాండ్ ప్రజలు పాలు చెడిపోకుండా ఉండేందుకు వింత పద్దతిని పాటించేవారు. వాళ్లు తమ పాల సీసాల్లో బతికి ఉన్న కప్పను ఉంచేవారట. కప్ప చర్మం హానికరమైన బ్యాక్టీరియాను చంపే సహజ పదార్థాలను విడుదల చేస్తుంది. సో, పాలు చెడిపోకుండా ఉండేవట.
ఫ్రిజ్ లేని సమయంలో ఫ్రెష్ పాల కోసం!
సెవెంటీస్, ఎయిటీస్ లో ఫ్రిజ్ లు ఉండేవి కాదు. పాలను ఎక్కువ గంటలు తాజాగా ఉంచలేకపోయేవారు. ముఖ్యంగా వెచ్చని వాతావరణంలో పాలు త్వరగా చెడిపోయేవి. వీటిని చాలా సేపు ఫ్రెష్ గా ఉంచేందుకు కప్పలను ఉపయోగించేవారట. రానా టెంపోరేరియా జాతి కప్పలను పాలను నిల్వ చేసే పాత్రలో ఉంచేవారట. ఈ కప్పల పాలలో ఉండటం వల్ల అవి త్వరగా చెడిపోయేవి కాదట. ఈ పద్దతిని రష్యాతో పాటు ఫిన్ లాండ్ లో ఇప్పటికీ పాటిస్తున్నారట.
కప్పలు పాలను ఎలా ఫ్రెష్ గా ఉంచుతాయంటే?
రానా టెంపోరేరియా కప్పలను పాలలో ఉంచడం వల్ల అవి త్వరగా ఎందుకు చెడిపోవడం లేదనే అంశంపై శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేశారు. కప్పల చర్మం యాంటీమైక్రోబయల్ పెప్టైడ్స్ అనే ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది సహజ యాంటీబయాటిక్స్ లాగా పని చేస్తాయి. స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇ. కోలి లాంటి పాలను విరగొట్టే బ్యాక్టీరియాను చంపుతాయి. కప్ప పాలలో ఉన్నప్పుడు, ఈ ప్రోటీన్లు కలిసిపోయి బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయని పరిశోధకుల గుర్తించారు. జర్నల్ ఆఫ్ ప్రోటీమ్ రీసెర్చ్ లో 2012లో జరిపిన ఒక అధ్యయనంలో రానా టెంపోరేరియా కప్ప చర్మంలో ఈ బాక్టీరియా, యాంటిబయాటిక్ ప్రోటీన్లు ఉన్నాయని తేలింది. అవి బ్యాక్టీరియా కణాలను విచ్ఛిన్నం చేయడంతో పాటు పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచుతాయి గుర్తించారు. అయితే, కప్ప శుభ్రంగా లేకపోతే ఇతర సమస్యలు వస్తాయని గుర్తించారు. అయితే, అప్పటి వరకు పాలను నిల్వ చేసే బెస్ట్ పద్దతి ఇదే అని వెల్లడించారు.
వాస్తవానికి రానా టెంపోరేరియా అనే బ్రౌన్ కప్పలు రష్యా, ఫిన్లాండ్ లో సర్వసాధారణంగా కనిపిస్తాయి. పట్టుకోవడం చాలా సులభం. వాటిని ఉపయోగించడం కూడా చాలా సురక్షితం. అవి కొంత కాలం పాటు పాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తాయి. అందుకే వాటిని ఉపయోగించేవారు. ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పద్దతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది మాత్రం ఇప్పుడు ఫ్రిజ్ లో పాలను నిల్వ చేస్తున్నారు.
కప్ప చర్మం నుంచి ఔషధాల తయారీ?
కప్పల ద్వారా పాలను నిల్వ చేయడం మాత్రమే కాదు, ప్రస్తుతం ఔషధ తయారీలోనూ ఉపయోగపడుతున్నాయి. ఔషధాలకు స్పందించని బ్యాక్టీరియాకు ఔషధాలను రూపొందించేందుకు కప్ప చర్మం ప్రొటీన్ లను అధ్యయనం చేస్తున్నారు. దీని ద్వారా యాంటీబయాటిక్స్ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా పాతకాలం ప్రజలు ఎంత తెలివైనవారో, ప్రకృతి సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఈ పద్దతి చూపించింది. పాత ఆలోచనలు నేటికీ మనకు కొత్త విషయాలను నేర్పించగలవని కూడా ఈ పద్దతి వెల్లడిస్తుంది.