Intinti Ramayanam Today Episode july 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి అక్షయ్ అవనీ ఎక్కడ కలిసి పోతారని టెన్షన్ తో అక్షయ్ కి చాలాసార్లు ఫోన్ చేస్తుంది.. రాజేంద్ర ప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడడు. నీ ఫోన్ లిఫ్ట్ చేసి వెటకారంగా పార్వతి అనే పేరును అడ్డుపెట్టుకొని మాట్లాడుతుంది. శ్రీకర్ కమల్ మాత్రం వదిన అమ్మకు బాగానే చెప్తుంది అని అనుకుంటారు. పార్వతి అన్న పేరు చెప్పి ఆడుకుంటుంది. అవని కావాలనే ఇలా చేస్తుందని పార్వతి అనుకుంటుంది. నేను మీ అత్తయ్య పార్వతిని అని చెబుతుంది. అవునా అత్తయ్య గారు నేను మీ కోడలు అవనీని మాట్లాడుతున్నాను అని అంటుంది. ఏంటి ఇలా ఫోన్ చేశారు అని అడుగుతుంది. అవని పార్వతిని ఒక ఆట ఆడుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పల్లవి అక్షయ్ భానుమతి ఏం చేస్తున్నారో చూడాలని వస్తుంది. ఆ ఇంటికి తాళం వేయడం చూసి వీళ్ళు అవనితో కలిసిపోయారని అనుమానంతో ఆ ఇంటికి చూడాలని వస్తుంది. పల్లవి విలను చూస్తే కచ్చితంగా అత్తయ్య దగ్గర చెప్పి పెద్ద రచ్చ చేస్తుంది అని అవని ఆలోచిస్తుంది. పల్లవి కి అవి నేను చూడగానే అనుమానం మొదలవుతుంది. ఇంట్లోకి వెళ్లి నేను చెక్ చేయాలని అంటుంది. అందరూ తడబడుతూ సమాధానం చెప్పడం లో పల్లవి అనుమానం మరింత బలంగా మారుతుంది. వెళ్లి ఇంట్లో రూములు చెక్ చేస్తానని అంటుంది. ప్రణతి కావాలనే పల్లవి మీద నీళ్లు పోయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
బయటికి రాగానే పల్లవి కావాలనే అవనీదంతా చేయించింది అనుకుంటూ వస్తుంది. ఎదురుగా భానుమతి రావడం చూసి ఏంటమ్మా ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. అక్షయ్ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. నేను ఆ చివర ఉన్న మందులు కొట్ట దగ్గరికి వెళ్లి మందులు తెచ్చుకుంటున్నాను అని అంటుంది. నిజంగానే నువ్వు మందు తెచ్చుకోవడానికి వెళ్ళావా అంటే ఇగో మందులు అని చూపిస్తుంది.. పల్లవి కోపంగా భానుమతి చెబుతున్న విషయాలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది..
ఇక పల్లవి వెళ్లిపోయిందని అందరూ టెన్షన్ ఫ్రీగా ఉంటారు. భానుమతి ఇంట్లోకొచ్చి ఈ పల్లవి కంటపడితే మీ అత్తయ్య దగ్గర ఊదేస్తుంది. ఆ తర్వాత పార్వతి పెద్ద రచ్చ చేస్తుంది అందుకే మనం జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఇప్పటికైతే పల్లవికి అనుమానం లేకుండా వెళ్ళిపోయింది. ఇంకొకసారి తనకు అనుమానం వస్తే ఖచ్చితంగా అత్తయ్యను తీసుకొని వస్తుందని అందరు కంగారు పడతారు.
Also Read : రోహిణి ఆట కట్.. ప్రభావతి విశ్వరూపం.. ఇల్లు వదిలేసి పోతుందా..?
పల్లవి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని పార్వతి తో చెప్తుంది. అమ్మమ్మ మందుల కోసం బయటికి వెళ్ళింది బావగారు ఇంటర్వ్యూ కోసం వెళ్లారు మీరు టెన్షన్ పడుతున్నట్టు అక్కడ ఏం జరగలేదు అత్తయ్య అని అంటుంది.. ఇక రాత్రి అక్షయ్ దగ్గరే ఏదైనా అవసరం ఉంటుందని కింద పడుకుంటుంది అవని. రాత్రులు నిద్ర పట్టలేదని అక్షయ్ లేస్తాడు. ఏమైందండీ అంటే ఆకలేస్తుంది నాకు నిద్ర పట్టడం లేదు అని అంటాడు. ఆ మాట వినగానే అవని ఏమి తినకుండా పడుకుంటే ఆకలేస్తుంది మీకోసం భోజనం తీసుకొని వస్తాను ఆగండి అని అంటుంది. అది విన్న రాజేంద్రప్రసాద్ చూసావా రా అవని నీకోసం ఎంత కష్టపడుతుందో.. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మంచం పైన పడుకున్నారు కానీ అవని మాత్రం నీకు ఏదైనా అవసరం ఉంటుందేమో అని నీ దగ్గరే పడుకుంది అని అంటాడు. కేవలం నీకోసమే అవని కష్టపడుతుంది. లేనిపోని అనుమానాలు పెట్టుకొని అవనిని దయచేసి బాధ పెట్టొద్దు రా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. నీకోసం ఎన్నో చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. తండ్రి చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకున్న అక్షయ్ అవని గురించి ఆలోచిస్తాడు. . అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..