Lokesh Kanakaraj : రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కూలీ. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రజనీకాంత్ అభిమానులు ఏం కోరుకుంటారు వాటిని ఈ ట్రైలర్ లో పెట్టాడు లోకేష్.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్రియేట్ చేసింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ అంతా హాజరైంది. ఈ సినిమా గురించి, అలానే నటుల గురించి లోకేష్ మాట్లాడారు.
నాగార్జున గారిని చూసి ఫంక్ పెంచాను
సౌబిన్ గారు ఈ సినిమా కోసం చెన్నై షిఫ్ట్ అయ్యారు. సినిమా చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుకుంటారు. ఉపేంద్ర సార్ మోస్ట్ డెడికేటెడ్ యాక్టర్, ఆయన ప్యాచ్ వర్క్ షూట్స్ కూడా మా కోసం కమిట్మెంట్ తో సపోర్ట్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా శృతిహాసన్ మాకు బిగ్గెస్ట్ సపోర్ట్. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా పాటలు కూడా పాడారు. త్వరలో ఆమె పాటలు కూడా రికార్డ్ చేస్తాం.
నాగర్జున గారిని ఈ రోల్ కోసం కన్వే చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఆయన సినిమాకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. నేను ఆయనను చూసి ఫంక్ పెంచాను అంటూ తెలిపారు. అమీర్ ఖాన్ సార్ బర్తడే ను అతనితో కలిసి చేయడం అనేది ప్రౌడ్ మూమెంట్. అతని డైరెక్ట్ చేయడం నా కల. ఫైనల్ గా అది నెరవేరింది.
రజనీకాంత్ సార్ చాలా నేర్పించారు
రజనీకాంత్ గారి గురించి చెప్పడానికి ఈ వేదిక సరిపోదు. అలానే టైం కూడా సరిపోదు. కొన్ని నిమిషాల్లో ఆయన గురించి చెప్పలేం. గత రెండు సంవత్సరాలు నాకు నిజంగా లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఆయన వ్యాల్యూస్ విస్డం నాకు ఒక అన్ ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. మీ 50 సంవత్సరాల సినిమాను మేము చూసాం, అండ్ మన సినిమా ఆగస్టులో విడుదలవుతుంది. మీ జర్నీ కూడా ఆగస్టులోనే మొదలైంది. ఇది ఇన్క్రెడిబుల్ హానర్. ఈ సినిమా జరగడానికి మెయిన్ రీజన్ అనిరుద్. నిద్రలేని రాత్రులు సినిమా కోసం పనిచేశాడు. అనిరుద్ నాకు ఒక తమ్ముడు లాంటివాడు. అంటూ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్.
Also Read: Gowtham Tinnanuri: జెర్సీ స్థాయిలో ఈ సినిమా లేకపోవడానికి అసలు కారణాలు ఇవే