Nagarjuna Look In Coolie Trailer: రజనీకాంత్ కూలీ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ ఎలివేషన్స్, అనిరుధ్ సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యానరిజం గురించి తెలిసిందే. ట్రైలర్ మొత్తం స్టార్ నటుల లుక్, పెర్ఫామెన్స్ ప్రతి సీన్ నెక్ట్స్ లెవెల్ అనేట్టుగా ఉంది. ట్రైలర్ లో ప్రతీ నటుడిని ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి ఒక్క నటుడిని ప్రత్యేకంగా చూపించాడు లోకేష్ కనగరాజ్. దాదాపు 3 నిమిషాల 7 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంటోంది.
కింగ్ అల్వేస్ కింగ్
ముఖ్యంగా రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జు, రియల్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ లు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. ఇందులో యాక్షన్ సీన్స్, నటీనటుల లుక్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జున లుక్ పై పాజిటివ్ టాక్ వస్తోంది. ఇందులో నాగ్ లుక్ చూసి కింగ్ ఆల్వేస్ కింగ్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఆయన కెరీర్ ది బెస్ట్ లుక్ ఇదేనని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందంటూ నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ ట్రైలర్ నాగార్జున వాయిస్ తో మొదలవుతుంది. ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావలన్నది తలపై రాసి పెట్టి ఉంటది అంటూ అనే బ్యాగ్రౌండ్ వాయిస్ ఇచ్చారు.
నాగార్జున లుక్, రజనీ లుక్ నెటిజన్స్ రియాక్షన్
ఆ తర్వాత ట్రైలర్ ఒక్కొ నటుడిని పరిచయం చేశారు. మధ్య కొన్ని సెకండ్ల తర్వాత నాగార్జున చేతిలో ఆయుధంతో వైట్ ప్లేజర్ వేసి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్ లో ఆయన విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సినీ కెరీర్ లో ఎన్నడు చూడని లుక్ ఇది అంటున్నారు. ఆ తర్వాత గన్ పట్టుకుని కనిపించే షాట్ అయితే ఫ్యాన్స్ పిచ్చెక్కిస్తుందో. మా కింగ్ ఎలివేషన్ ఈ రేంజ్ ఊహించలేదు లోకేష్ భయ్యా.. నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున కూలీలో నెగిటివ్ షేర్ ఎందుకు చేస్తున్నాడని విమర్శించిన వారికి ఈ ట్రైలర్ తో గట్టి సమాధానం ఇచ్చారంటూ లోకేష్ ని పనితీరుని కొనియాడుతున్నారు.
మొత్తానికి కూలీ ట్రైలర్, ముఖ్యంగా నాగార్జున లుక్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక రజనీకాంత్ లుక్, ప్రెజెన్స్ గురించి చెప్పుకుంటే.. ఆయన కటౌట్ ని లోకేష్ పర్ఫెక్ట్ వాడాడంటున్నారు. అభిమానులు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారో.. కరెక్ట్ అది డెలివరి చేశాడని, కూలీ ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. కోలీవుడ్ కలగా ఉన్న వెయ్యి కోట్ల కలెక్షన్స్ కూలీ తీరుతుందని ఇండస్ట్రీలు వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ కూలీ ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచింది. కేవలం ట్రైలర్ తోనే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యిందంటే.. ఆగష్టు 14న థియేటర్లు ఎలా దద్దరిల్లానున్నాయో చూడాలి.