Gowtham Tinnanuri: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రత్యేకమైన దర్శకులలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన గౌతం మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆల్మోస్ట్ సుమంత్ మార్కెట్ అయిపోయింది అనుకునే టైంలో ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాని హీరోగా జెర్సీ అనే సినిమాను చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది ఈ సినిమాకు యునానిమస్ సక్సెస్ టాక్ ఇచ్చారు. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో జెర్సీ సినిమా ఒక మెయిల్ స్టోన్ ఫిలిం అని చెప్పాలి.
జెర్సీ స్థాయిలో లేకపోవటానికి కారణం
జెర్సీ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. దీనికి కారణం జెర్సీ సినిమాలో గౌతమ్ క్రియేట్ చేసిన వరల్డ్. దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. అలానే ఒక ఫాదర్ మరియు కొడుకు ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషన్ అందరికీ రిలేట్ అవుతుంది కాబట్టి విపరీతంగా కనెక్ట్ అయింది. అంతేకాకుండా 36 సంవత్సరాల అప్పుడు ఒక వ్యక్తి తన డ్రీమ్ కోసం కష్టపడతాడు. అది కూడా విపరీతంగా కనెక్ట్ అయింది. ఇది 22 సంవత్సరాలు వయసు నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్లకు రిలేట్ అయ్యే స్టోరీ. అందుకే జెర్సీ సినిమా చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది అని గౌతం తెలిపాడు.
కింగ్డమ్ ఒక కొత్త వరల్డ్
కింగ్డమ్ సినిమా విషయానికొస్తే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు గౌతమ్. ముందు నుంచి కూడా ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. నాగ వంశీ పలు సందర్భాలలో మాట్లాడుతూ.. కే జి ఎఫ్, సలార్ లాంటి సినిమా గౌతమ్ స్టైల్ లో తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా, ఇది గౌతమ్ కింగ్డమ్ అంటూ చెప్పవచ్చాడు. గౌతమ్ చాలామందికి రిలేట్ అయ్యే ఎమోషన్ స్టోరీని పక్కనపెట్టి ఒక కొత్త వారిలో అన్నదమ్ములు ఎమోషన్ చూపించాడు.
దీనిలో కూడా ఎమోషన్ ఉంది. కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ అవ్వడం వలన ఎమోషన్ పక్కకు వెళ్ళిపోయింది. కొన్నిచోట్ల చాలా ఎమోషనల్ గా చెప్పాల్సిన వాటిని కూడా మామూలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. విపరీతమైన ఎమోషన్ రాసే గౌతమ్ నుంచి ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో కూడా ఎమోషన్ అదే స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయటం వలనే కొంతమేరకు ఈ సినిమా విషయంలో అసంతృప్తి ఉంది. మొత్తానికి ఇది పక్కకు తీసి పడేయాల్సిన సినిమా అయితే కాదు.
Also Read: Coolie Trailer: కూలీ ట్రైలర్ వచ్చేసింది, రజిని ఫ్యాన్స్ కు పూనకాలు