E-Paper

లాటరీ కొట్టిన రెజీనా కసాండ్రా.. లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్!

లాటరీ కొట్టిన రెజీనా కసాండ్రా.. లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా  లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్!
Advertisement

Lokesh Producer: లోకేశ్ కనగరాజ్…’ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇపుడు రూటు మార్చాడు. ఇప్పటికే ‘డీసీ’ ( ప్రచారంలో ఉన్న మరో టైటిల్)అనే సినిమాతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన లోకి ఇపుడు మరో క్రాఫ్ట్ లోకి అడుగు పెడుతున్నాడు.అవును అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకి మరింత సమయం పట్టేలా ఉండటంతో మెగా ఫోన్ పక్కన పెట్టి నిర్మాతగా మారిపోతున్నాడు.కమర్షియల్ సినిమాలకి భిన్నంగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలతో వచ్చే యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఏకంగా ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టడం ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో హట్ టాపిక్ అయింది.

ఒక పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌

Advertisement

ఇక లోకి తన బ్యానర్ పై ప్రొడ్యూస్ చేయబోయే మొదటి సినిమా కోసం ఒక పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌ను సెలెక్ట్ చేసుకోవడం ఒక విశేషం అయితే టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా ఇందులో మెయిన్ లీడ్ గా ఎంచుకోవడం మరో విశేషం.’శివ మనసులో శృతి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , ‘ఎవరు’ వంటి డిఫరెంట్ జానర్లతో సత్తా చాటిన రెజీనా కి లోకి నిర్మిస్తున్న సినిమా మరింత మైలేజ్ తెస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాని యంగ్ డైరెక్టర్ విశాల్ వెంకట్ తెరకెక్కించనున్నాడట.’సిల నేరంగళిల్ సిల మణితర్గళ్’ వంటి డిఫరెంట్ ఫిలిం తెరకెక్కించింది ఈయనే కావడం విశేషం .ఇక సినిమా విషయానికి వస్తే స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా ముగిసిందని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని కోలీవుడ్ టాక్.తన సినిమాల్లో క్యారక్టర్స్ పట్ల ఏంతో కేరింగ్ తీసుకునే లోకేష్ కనగరాజ్ ఈ సినిమా స్క్రిప్ట్ లో కూడా అంతే జాగ్రత్త రీసుకుంటున్నాడట.

Advertisement

ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో !

ఇక ఈ సినిమాలో రెజీనా పాత్ర సాలిడ్ మెసేజ్ ఇవ్వడంతో ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా థ్రిల్ చేస్తుందని సమాచారం.ఇక లోకి నటిస్తున్న ‘డీసీ’ సినిమా ప్రమోషన్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్

also read:నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

ఇక ఈ సినిమాకి సంబందించిన మరో విశేషం ఏంటంటే సినిమా మొదలవకముందే డిజిటల్, శాటిలైట్ హక్కులు మాకంటే మాకంటూ పలు ఓటిటి సంస్థలు పోటీ పడుతున్నాయట. మొత్తానికి లోకేశ్ కనగరాజ్ తన డైరెక్టర్ బ్రాండ్ ఇమేజ్ ని ఇలా కన్వర్ట్ చేస్తున్నాడన్న మాట.చూడాలి మరి 2026 ద్వితీయార్థంలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో !

Related News

అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా.. 15 ఏళ్లు నరకం చూశా -యాక్టర్ బాలాజీ!

రఘువరన్ మృతికి కొడుకే కారణమా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బాలాజీ!

టాలీవుడ్ వీకెండ్ వార్ .. బాక్సాఫీస్ విన్నర్ ఎవరో ?

నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!

ఆ సంఘటన నన్ను మార్చేసింది.. విలన్ పాత్రల ప్రభావంపై బాలాజీ ఊహించని కామెంట్స్!

జూబ్లీహిల్స్ ఆస్తి వేలం వివాదం.. సుప్రీంకోర్టుకు బండ్ల గణేశ్! కోర్టు డ్రామా వెనుక అసలు కథ ఇదే..

Big Stories

×