E-Paper
Advertisement

నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!

నాని ఫ్యాన్స్‌కు షాక్.. ఆ క్రేజీ డైరెక్టర్ సినిమా పెండింగ్? లైన్‌లోకి కోలీవుడ్ సెన్సేషన్!
Advertisement

Nani Paradise: నాని ..పక్కింటి అబ్బాయిగా టాలీవుడ్ లో పాతుకుపోయిన ఈ కుర్ర హీరో ఇపుడు ఊర మాస్ గా మారిపోయాడు. ఆక్రమంలో వచ్చిన దసరా సాలిడ్ హిట్ కాగా ఇపుడు ప్యారడైజ్ తో మరోసారి సత్తా చాటుతానంటూ రెడీ అయిపోయాడు.మరో వైపు కెరీర్ ని కూడా అదే జోష్ లో పరుగులు పెట్టిస్తున్నాడు.మాములుగా అయితే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాడు నాని ,కాని సీన్ మారినట్టే కనిపిస్తుంది.ప్యాన్ ఇండియా ట్యాగ్ వేసుకునే క్రమంలో ఏడాదికి ఒక సినిమా కూడా వదల్లేకపోతున్నాడు .

ఇక నాని ఫోకస్ అంతా ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ పైనే ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో చెప్పక్కర్లేదు.. ఆ నమ్మకంతోనే ఈసారి నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. అయితే అప్పుడెప్పుడో వస్తుందని ఊదరగొట్టిన ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండటంతో డీలా పడిపోయారు నాని ఫ్యాన్స్.

Advertisement

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమా ఈ ఏడు దసరా సీజన్ లో అంటే సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేయవచ్చు అన్నటాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై అంటూ మేకర్స్ నుండి కాని, ఇటు నాని వైపు నుండి కాని ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడంతో అసలు నిజంగానే వస్తుందా లేక మళ్ళీ వాయిదాల పాట పాడుతుందా అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్.ఇక సినిమా జరుగుతున్న వాలకం చూస్తుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదు.

ఇక దీని సంగతి ఇలా ఉంటె OG తర్వాత నా నెక్స్ట్ సినిమా ఇదే అంటూ నానితో బ్లడీ రోమియో అనే సినిమాకి కొబ్బరికాయ కొట్టిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సినిమా డైలమాలో పడినట్టు తెలుస్తుంది.దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్‌తో సుజీత్ చేస్తోన్న ‘OG’ (ఓజి) సినిమా మళ్లీ సెట్స్ మీదికి వెళ్తుందన్న టాక్ తెరమీదికి రావడమే.సుజిత్ తన టైం మొత్తాన్ని OG 2కి కేటాయించడంతో బ్లడీ రోమియో ని సైడ్ చేశాడట సుజిత్.

Advertisement

also read:సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ షాక్.. ఆ సీన్స్ తీసేస్తేనే రిలీజ్!

దీంతో నాని ఈ ప్లేస్ ని సుభాష్ కె రాజ్ అనే దర్శకుడితో భర్తీ చేయబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇంతకీ ఈ సుభాష్ కె రాజ్ ఎవరనుకుంటున్నారా.. తమిళంలో ‘బ్లాస్ట్ జోన్’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టరే ఈ సుభాష్ కె రాజ్.ఇక నాని కోసం సుభాష్ కూడా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.ఇక బ్లాస్ట్ సినిమా విషయానికి వస్తే చాలా తక్కువ లొకేషన్స్, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఎలివేషన్స్‌తో బాక్సాఫీస్ వద్ద 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కోలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెల్సిందే.చూడాలి మరి తెగ సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలపై మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో !

Related News

ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

Big Stories

Advertisement
×