BigTV English

Rajinikanth Coolie : రజినీపై లోకి ప్రయోగాలు… ట్రైలర్ లేదు – టీజర్ లేదు

Rajinikanth Coolie : రజినీపై లోకి ప్రయోగాలు… ట్రైలర్ లేదు – టీజర్ లేదు

Rajinikanth Coolie : లోకేష్ కనగరాజ్… ఈ డైరెక్టర్‌ను మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమా యావరేజ్ టాక్ వచ్చినా… కలెక్షన్లకు అయితే ఎలాంటి డోకా ఉండదు. ఇక రజినీకాంత్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఆఫీస్‌లకు సెలవు పెట్టేస్తారు. అలాంటి రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ‘కూలీ’ అనే సినిమా వస్తుంది. ఈ సినిమా ఎంత హైప్‌ ఉందో మాటల్లో చెప్పలేం.


రజినీకాంత్‌తో పాటు ఉపెంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్‌లు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఇంత మంది స్టార్స్ ఉన్న తర్వాత అభిమానులు ఉంటారా… హైప్‌తో పోయేలా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా టీజర్ వస్తుందా ? ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా ? అసలు సినిమా ఎప్పుడూ చూస్తాము… అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్లందరికీ బిగ్ షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి.. టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేయడానికి లోకేష్ రెడీగా లేడట. అది ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అది 2019. విజయ్ దళపతితో లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ అనే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలోనే రజినీకాంత్‌ను కలిశాడు లోకి. ఓ కథ చెప్పాడు. అది రజినీకి కూడా బాగా నచ్చింది. చేద్దామని ఫిక్స్ అయ్యారు. 2021లో షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ, కరోనా పాండెమిక్. దీంతో మధ్యలోనే ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత రజినీకాంత్ ‘అన్నాత్తె’ మూవీకి డేట్స్ ఇచ్చాడు. దీంతో లోకితో చేసే ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోయింది అంటూ రూమర్స్ వచ్చాయి.


ఆ తర్వాత లోకి.. ‘విక్రమ్’ సినిమా చేశాడు. రజనీ… ‘జైలర్’ చేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. అప్పుడు రజినీ – లోకి మళ్లీ ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. దాంట్లోకి పట్టుబట్టి మరీ నాగార్జునను తీసుకున్నాడు. అలాగే ఉపెంద్ర, అమీర్ ఖాన్ లను కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చేశాడు.

అలా సాగుతూ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ‘వార్ 2’కు గట్టి పోటీ ఇవ్వబోతుంది. అయితే, ఈ సినిమా విషయంలో లోకి ప్రయోగాలు చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ ఇంపార్టెంట్. అది ప్రమోట్ అవ్వాలి అంటే.. గ్లింప్స్, టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేస్తారు. ఈ మధ్య కొంత మంది రెండు ట్రైలర్లు రిలీజ్ చేస్తున్నారు. వాటికి ట్రైలర్ అని, రిలీజ్ ట్రైలర్ అని పేర్లు పెడుతున్నారు.

కానీ, లోకి మాత్రం ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వడట. ఏం చూడాలన్నా.. థియేటర్‌కి వచ్చి చూడాల్సిందేనట. టీజర్, ట్రైలర్ అంటే.. సినిమాలో ఉన్న పాత్రల ట్విస్ట్ లు రివీల్ అయ్యే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. సినిమాలో ఉండే ప్రతి ట్విస్ట్… థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని లోకేష్ అనుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాకు నో ట్రైలర్.. నో టీజర్. ఎలాగూ అక్కడ ఉన్నది రజనీ కాంత్ కాబట్టి… ఫస్ట్ డే ఫస్ట్ చూసే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ మూవీ. వీటికి తోడు ఉపెంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్, పూజా హెగ్డే, శృతి హాసన్ అదనపు బలం.

టీజర్, ట్రైలర్ లేకపోయినా.. ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే భారీగానే ప్లాన్ చేస్తున్నారు. చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్ చేయబోతున్నారు. అలాగే హైదరాబాద్ లో ఆగస్టు 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. మిగితా నగరాల్లో కూడా ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.

Related News

Siva Karthikeyan : మదరాసి మూవీలో యంగ్ టైగర్ గెస్ట్ రోల్… ఓపెన్‌గా చెప్పేసిన హీరో

Vijay Devarakonda: దిల్‌ రాజుకి ‘రౌడీ’ నచ్చడం లేదా.. అందుకే ఈ మార్పులా?

Naga Chaitanya Samantha : సమంత కేసు… మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున, నాగ చైతన్య

Little Hearts Making Video: ఒక్క చిన్న వీడియో… బుడ్డోళ్లు ఇండస్ట్రీ మొత్తాన్ని ట్రోల్ చేశారు

Spirit : అయ్యో ప్రభాస్ కి ఏమైంది, మరి అంతలా తగ్గిపోయాడు ఏంటి?

Anupama Parameswaran: ఆ డైరెక్టర్ నరకం చూపించాడు.. స్టేజ్‌పైన అనుపమ

Big Stories

×