Viral Video: సోషల్ మీడియా వింతలు, విశేషాలకు నిలయం. ప్రపంచ నలుమూలల ఏం జరిగినా.. ఈ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారుతుంటుంది. ముఖ్యంగా జంతువుల వీడియోలు ఇందులో ఆకట్టుకుంటాయి. జంతు ప్రపంచంలో ఎన్నో వింతలు, అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారినప్పుడు వాటిని చూసి థ్రిల్ అవుతాం.
Also Read: CHRIS GAYLE: 400 రన్స్ చేయకపోవడంపై గేల్ ఫైర్…అసలు ముల్డర్ సిగ్గుందా !
కొంతమంది సరదా కోసం ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూ తమ సమయాన్ని గడుపుతారు. ఇలా జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ అవ్వడానికి కారణం ఇదే. అయితే వాస్తవానికి ఈ జంతువుల అరుదైన దృశ్యాలు అడవిలోనే కనిపిస్తాయి. అప్పుడప్పుడు మన మధ్య జరిగే కొన్ని అరుదైన దృశ్యాలు కూడా భలే గమ్మత్తుగా అనిపిస్తాయి.
కుక్కలు తెలివైన జీవులు:
అయితే జంతువులలో కుక్కలకు తెలివైన జీవులు అనే పేరు ఉంది. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా కుక్కలను మనుషులు తమ పనులకు వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. కుక్కలను ఇంటికి కాపలాగా, గొర్రెల కాపరిగా, కంటి చూపు లేని వారికి మార్గదర్శకులుగా, గాలింపు రక్షణ చర్యల్లో సహాయకులుగా ఇవి సేవలందిస్తున్నాయి. ఇవి మనుషుల ఆదేశాలను త్వరగా నేర్చుకుంటాయి. చాలా కుక్కలు మనుషుల పదాలను, భావోద్వేగాలను గుర్తిస్తాయి. ఇలా కుక్కల తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తాయి. కుక్కలు మనుషులనుండి సూచనలు గ్రహించడంలో, సమూహ పనులను అర్థం చేసుకునే సహజ స్వభావం వీటిలో ఉంది.
కుక్కతో క్రికెట్ మ్యాచ్
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ కుక్కకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క క్రికెట్ ఆడింది {Dog batting}. కుక్కేంటి.. క్రికెట్ ఆడడం ఏంటి..? అని ఆశ్చర్యపోకండి. కుక్క నిజంగానే క్రికెట్ ఆడింది. నోటితో బ్యాట్ పట్టుకొని బంతిని భారీ షాట్ ఆడింది. బంతిని మాత్రం అస్సలు మిస్ చేయలేదు. అంతేకాదు ఆ కుక్క ఆడిన షాట్.. అటువైపు ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తి పురు*** పై తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు.
Also Read: Kholi – Avneet kaur: విరాట్ కోహ్లీని నీడలా వెంటాడుతున్న ఆ అందాల తార… షాక్ లో అనుష్క శర్మ
ఇది ఓ మెకానిక్ షాప్ లో జరిగినట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ని {twinkle.talkz} అనే పేజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకి వేల సంఖ్యలో లైక్ లు వచ్చి పడ్డాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. అలా కొట్టావు ఏంటి చింటూ బ్రో, చింటూ భాయ్ బోల్తే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో ఆ కుక్క సోషల్ మీడియాలో తెగ ఫెమస్ గా మారింది.
?utm_source=ig_web_copy_link