Mahavatar Narasimha Trailer: ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ మహావతార్ నరసింహ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహావతార్ నరసింహ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అత్యద్భుతంగా వుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది.. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
విజువల్ వండర్ గా ట్రైలర్..
విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ‘మహావతార్ నరసింహ’ సినిమాను థియేటర్లలో చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ కట్టపడేస్తోంది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రతి సీను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేయనున్నారు.. మొత్తానికి ఆ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..
హోంబలే ఫిలిమ్స్ ప్రయోగాలు..
హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల అంచనాలకు మించిపోయేలా ఉంటాయి. యాక్షన్, డ్రామా చిత్రాలకు పేరుగాంచినప్పటికీ, యానిమేషన్ చిత్ర రంగంలోకి అడుగుపెట్టడం ఒక వినూత్న ప్రయోగంగా చెప్పుకోవచ్చు. భారతీయ పౌరాణిక కథలకు యానిమేషన్ రూపాన్ని ఇవ్వడం ద్వారా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 3 డీ ఫార్మాట్ లో సినిమా విడుదల కావడం విజువల్ అనుభూతిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత, ‘మహావతార్ నరసింహ’ భారతీయ యానిమేషన్ సినిమాలకు కొత్త నిర్వచనలం ఇస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ నెల 25న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలి…